Bullet Bhaskar : జబర్దస్త్ షోలో షాకింగ్ పరిణామం… బుల్లెట్ భాస్కర్ కి గుండు కొట్టించిన జడ్జెస్, కుష్బూ ఫైర్!

Bullet Bhaskar : కామెడీగా మొదలైన స్కిట్ సీరియస్ నెస్ కి దారి తీసింది. జడ్జెస్ మీద అసహనం వ్యక్తం చేసిన బుల్లెట్ భాస్కర్ నిజంగా గుండు చేయించుకున్నాడు. ఎక్సట్రా జబర్దస్త్ షోలో టీమ్ లీడర్ గా ఉన్నాడు బుల్లెట్ భాస్కర్. బుల్లెట్ భాస్కర్ ఈ వారానికి నిజం మూవీ స్పూఫ్ స్కిట్ గా ఎంచుకున్నాడు. నిజం మూవీలోని మహేష్ రోల్ నాటీ నరేష్ చేశాడు. మహేష్ తల్లి పాత్ర మరొకరు చేశారు. బుల్లెట్ భాస్కర్ విలన్ […]

Written By: NARESH, Updated On : November 20, 2023 1:34 pm
Follow us on

Bullet Bhaskar : కామెడీగా మొదలైన స్కిట్ సీరియస్ నెస్ కి దారి తీసింది. జడ్జెస్ మీద అసహనం వ్యక్తం చేసిన బుల్లెట్ భాస్కర్ నిజంగా గుండు చేయించుకున్నాడు. ఎక్సట్రా జబర్దస్త్ షోలో టీమ్ లీడర్ గా ఉన్నాడు బుల్లెట్ భాస్కర్. బుల్లెట్ భాస్కర్ ఈ వారానికి నిజం మూవీ స్పూఫ్ స్కిట్ గా ఎంచుకున్నాడు. నిజం మూవీలోని మహేష్ రోల్ నాటీ నరేష్ చేశాడు. మహేష్ తల్లి పాత్ర మరొకరు చేశారు. బుల్లెట్ భాస్కర్ విలన్ గోపీచంద్ రోల్ చేశాడు.

నిజం చిత్రంలో విలన్ గోపీచంద్ గెటప్ భయంకరంగా ఉంటుంది. మెయిన్ విలన్ జయప్రకాశ్ రెడ్డిని చంపేసి గోపీచంద్ విలన్ గా అవతరిస్తాడు. గుండు గీయించుకుని, రక్తాభిషేకం చేసుకుని దేవుడు అని చెప్పుకుంటాడు. ఇక నిజం స్పూఫ్ స్కిట్ లో బుల్లెట్ భాస్కర్ గోపీచంద్ రోల్ చేసిన నేపథ్యంలో… గెటప్ సెట్ కాలేదని జడ్జెస్ అన్నారు. ఆ మూవీలో గోపీచంద్ గుండుతో ఉంటాడు. మీరు గుండు చేయించుకోలేదు. కనీసం ఆ గెటప్ వేయలేదు అన్నారు.

దాంతో ఆవేశానికి గురైన బుల్లెట్ భాస్కర్ జడ్జెస్ ఎదుట వేదిక మీదే గుండు గీయించుకున్నాడు. దాంతో అందరూ షాక్ అయ్యారు. మేము గుండు గెటప్ వేయమన్నాము కానీ నిజంగా గుండు చేయించుకోమనలేదు.. అని బుల్లెట్ భాస్కర్ తో జడ్జెస్ అన్నారు. మిమ్మల్ని సంతృప్తి పరచడానికి తప్పలేదని బుల్లెట్ భాస్కర్ రూడ్ గా ప్రవర్తించాడు. దాంతో జడ్జి కుష్బూకి కోపం వచ్చింది. జడ్జెస్ అంటే రెస్పెక్ట్ లేని చోట నేను ఉండను… అంటూ లేచి వెళ్ళిపోయింది.

వారించినా ఆమె ఆగలేదు. నవ్వులు పండించే జబర్దస్త్ షోలో ఈ సీరియస్ పరిణామం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇక నిజంగా బుల్లెట్ భాస్కర్ జడ్జెస్ తో గొడవ పడ్డాడా లేక ప్రోమో కోసం చేసిన డ్రామానా తెలియాలంటే… నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి. ఈ ఎపిసోడ్ కి గెస్ట్ గా బేబీ మూవీ ఫేమ్ సిరాజ్ కూడా వచ్చారు. వైష్ణవి చైతన్యతో సిరాజ్ చేసిన బెడ్ రూమ్ సీన్ ఫుల్ వీడియో కావాలని ఇమ్మానియల్ అడిగాడు.