Bone Health: శరీరంలో దృఢమైన, స్థిరమైన అవయవాలుగా ఉండేవి ఎముకలు. ఇవి శరీరానికి సున్నితంగా ఉండే అవయవాలను రక్షిస్తూ ఉంటాయి. బయట నుంచి ఏదైనా దాడి ఎదురైనప్పుడు వీటి ద్వారా మనుషులు రక్షించుకుంటారు. ఎముకల్లో ఖనిజాలు, పాస్ ఫైట్ ఉండడంతో ఇవి బలంగా ఉంటాయి. అయితే కొందరిలో ఇవి బలహీనంగా ఉండి కొన్ని పనులు చేయడానికి సహకరించవు. ముఖ్యంగా ఎముకలు బలహీనంగా ఉంటే ఎప్పుడూ నీరసంగా ఉంటుంది. ఏ పని చేయడానికి ముందుకు రారు. కండరాలను రక్షించడంలో ఎముకలు ప్రధానంగా పనిచేస్తాయి. అయితే ఇవి బలహీనంగా ఉండడంతో కండరాల నొప్పులు ఉంటాయి. మరి ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి?
ప్రస్తుత కాలంలో సాధారణ ఆహారం కంటే కాస్త ఎక్కువగా ప్రోటీన్, ఖనిజాలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అదనపు శక్తిని ఇచ్చినట్లు అవుతుంది. వీటిలో ప్రధానంగా ఫ్రూట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. పండ్లను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. పండ్లు తినడం వల్ల కాల్చియం వంటి ఖనిజాలు అంది శరీరానికి రక్షణగా ఉంటాయి. అయితే అన్ని రకాల ఫ్రూట్స్ కంటే కొన్ని ప్రధానమైనవి తీసుకోవడం వల్ల ఎముకలకు ఆరోగ్యాన్ని ఇచ్చినట్లు అవుతారు.
ఎముకలు బలంగా ఉండడానికి నారింజపండు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి విటమిన్ డి ని అందిస్తుంది. క్రమం తప్పకుండా నారింజ పండును తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి.మార్కెట్లోకి వెళ్ళగానే ముందుగా కనిపించే పండు అరటిపండు. ఇది కాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ అందుబాటులో ఉంటుంది. అరటిపండును నేరుగా కాకుండా లేదా ఇతర మార్గాల ద్వారా తీసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అరటిపండును తినడం మర్చిపోవద్దు.
అవకాడో ఫ్రూట్ లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కీళ్లవాపులు తగ్గుతాయి. అలాగే స్ట్రాబెర్రీ రాజ్బెర్రీస్ వంటి ఫ్రూట్లలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఎప్పటికీ రక్షిస్తూ ఉంటాయి. మామిడిపండు లోను విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఈ రెండు ఉండడం వల్ల ఎముకలు బలంగా ఉండడానికి మారుతాయి.
పండ్లు మాత్రమే కాకుండా కూరగాయలు, ఇతర పదార్థాల్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉండి ఎముకలకు బలాన్ని అందిస్తాయి. కూరగాయల్లో పాలకూరను అధికంగా తీసుకోవాలి. ప్రతిరోజు శరీరానికి 25% వరకు కాల్షియన్ని పాలకూర అందిస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే ఈ ఆకుల్లో విటమిన్ ఏ, ఐరన్ పుష్కలంగా ఉంటుంది
డ్రై ఫ్రూట్స్ లో నట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిలో మెగ్నీషియం, ఫాస్పరస్ అధికంగా లభిస్తాయి. ఇవి ఎముకలను కాపాడడానికి సహాయపడతాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే పాలు కూడా ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడతాయి. ప్రతిరోజు టీ కి బదులు పాలు తీసుకోవడం వల్ల కాల్షియం శరీరానికి ఇచ్చినట్లు అవుతుంది.