AP Exit Polls 2024: ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఎగ్జిట్ పోల్ సర్వేలో మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. కొన్ని సంస్థలు అధికార వైసీపీకి జై కొట్టగా.. మరికొన్ని టిడిపి కూటమిదే విజయం అని తేల్చి చెప్పాయి. అయితే మెజారిటీ సర్వేలు మాత్రం టిడిపి కూటమిదేనని తేల్చి చెప్పడం విశేషం. గత అనుభవాల దృష్ట్యా.. ఎగ్జిట్ పోల్స్ సంస్థలు భిన్నంగా ఫలితాలు వెల్లడించడం సామాన్య ప్రజల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. ఎవరికి వారు తమకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ను అన్వయించుకుంటున్నారు.
జన్మత్ పోల్స్ సంస్థ వైసీపీకి 95 నుంచి 13 సీట్లు దక్కే అవకాశం ఉందని తేల్చింది. టిడిపి కూటమికి 67 నుంచి 75 సీట్లు దక్కుతాయని స్పష్టం చేసింది. పార్థ చాణిక్య సంస్థ వైసీపీకి 110 నుంచి 130 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. టిడిపి 55 నుంచి 65 సీట్లు దక్కించుకునే ఛాన్స్ ఉంటుందని తేల్చింది. ఆత్మసాక్షి సర్వేలో సైతం క్లియర్ కట్ గా వైసీపీ దే విజయం అని తేలింది. ఆ పార్టీకి 98 నుంచి 116 సీట్లు వస్తాయని.. టిడిపికి 59 నుంచి 77 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. ఆరా సంస్థకు సంబంధించి వైసీపీ 96 నుంచి 104 సీట్లు దక్కించుకుంటుందని తేలింది. టిడిపి 71 నుంచి 81 స్థానాలు పొందుతుందని తేల్చి చెప్పింది. రాప్ సర్వేలో సైతం వైసీపీ దే విజయం అని తేలింది. ఆ పార్టీకి 158 సీట్లు దక్కుతాయని.. తెలుగుదేశం కూటమి నాలుగు నుంచి 17 సీట్లకే పరిమితం అవుతుందని ఈ సర్వే తేల్చి చెప్పడం విశేషం.
అటు తెలుగుదేశం పార్టీ కూటమికి ఏకపక్ష విజయం దక్కుతుందని మరికొన్ని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. చాణుక్య స్ట్రాటజీ సర్వే సంస్థ టిడిపి కూటమి 114 నుండి 125 సీట్లు దక్కించుకుంటుందని తేల్చింది. వైసిపి 39 నుంచి 49 సీట్లలో విజయం సాధిస్తుందని తేల్చి చెప్పింది. ఇక పీపుల్ పల్స్ సంస్థ 111 నుంచి 135 స్థానాల్లో టిడిపి కూటమి విజయకేతనం ఎగురవేస్తుందని స్పష్టం చేసింది. వైసిపి 45 నుంచి 60 స్థానాలకు పరిమితం అవుతుందని తెలిసింది. పయనీర్ పోల్ స్ట్రాటజీ సంస్థ 144 సీట్లను టిడిపి కైవసం చేసుకుంటుందని తేల్చింది. వైసిపి 31 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పింది. జేబీఆర్ఎస్ జి సంస్థ 98 సీట్లలో టిడిపి కూటమి.. 73 సీట్లలో వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పింది. పల్స్ టుడే 121 నుంచి 129 టిడిపి.. 45 నుంచి 54 వైసీపీ… స్మార్ట్ ఫోన్ సర్వే 93 స్థానాల్లో టిడిపి కూటమి, మరో ఎనిమిది స్థానాల్లో ఏడ్జ్ చూపించింది. వైసీపీకి 82, మరో 8 స్థానాల్లో ఎడ్జ్ కనిపిస్తోంది. ప్రిజం సర్వేలో కూటమికి 110 వైసీపీకి 60, కేకే ఎగ్జిట్ పోల్ సర్వేలో అయితే కూటమికి ఏకంగా 161 సీట్లు వస్తాయని తేల్చింది. వైసిపి 14 సీట్లకే పరిమితం అవుతుందని కూడా తేల్చి చెప్పింది. టీవీ9 ఎగ్జిట్ పోల్ లో వైసీపీకి 13 పార్లమెంటు స్థానాలు, టిడిపి కూటమికి 12 పార్లమెంట్ స్థానాలు వస్తాయని తేలింది. ఎస్ జెడ్ సర్వేలో టిడిపి కూటమికి 139 అసెంబ్లీ స్థానాలు, వైసీపీకి 36 సీట్లు వస్తాయని తేలింది. నియోపాల్ సర్వేలో టిడిపికి 104 నుంచి 110 సీట్లు, వైసీపీకి 65 నుంచి 71 సీట్లు వస్తాయని తేలింది. ఇక ఇండియా టీవీ లోక్సభ ఎగ్జిట్ పోల్స్ లో ఏపీలో టీడీపీకి 13 నుంచి 15, వైసిపికి మూడు నుంచి ఐదు, జనసేనకు రెండు, బిజెపికి నాలుగు నుంచి ఆరు పార్లమెంట్ స్థానాలు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. శ్యాన్ సర్వేలో సైతం టిడిపి కూటమి 127 సీట్లలో గెలుస్తుందని తేలింది. వైసిపి 48 సీట్లకే పరిమితం అవుతుందని సదరు సంస్థ తేల్చి చెప్పింది. మొత్తానికైతే ఇప్పటివరకు విడుదలైన ఎగ్జిట్ పోల్ సర్వేలో కూటమిదే పైచేయిగా కనిపిస్తోంది.