
‘వి’ మూవీ ఎఫెక్ట్ నాని తాజా చిత్రం పడుతోంది. నిర్మాత దిల్ రాజు-నాని కాంబోలో ‘వి’ తెరకెక్కింది. ఈ మూవీలో నాని విలన్ గా.. సుధీర్ బాబు హీరోగా నటించాడు. నివేదా థామస్.. అదితిరావు హైదరీలు హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు ‘వి’ చిత్రాన్ని భారీ బడ్జెట్లో తెరకెక్కించాడు. ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ కరోనా కారణంగా ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది.
నాని 25వ చిత్రంగా ‘వి’ మూవీ తెరకెక్కింది. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజైన రోజే ప్లాప్ టాక్ తెచ్చుకొని అభిమానులను నిరాశపరిచింది. ఈ మూవీలో ఓటీటీ రిలీజు చేయడం నిర్మాతకు కలిసివచ్చింది. థియేటర్లలో రిలీజైతే ఈ మూవీ వల్ల నిర్మాత భారీగా నష్టపోవాల్సి వచ్చేదనే అభిప్రాయం వ్యక్తమైంది.
‘వి’ సినిమా ఫెల్యూర్ నాని తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’పై పడినట్లు కన్పిస్తోంది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్ నిర్మించనున్నట్లు ప్రకటించింది. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో నిర్మాతలు మిడ్ బడ్జెట్ సినిమాలపై అధికంగా ఖర్చు పెట్టేందుకు ఇష్టపడటం లేదు. దీంతో నాని సినిమా చేతులు మారుతోందనే వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.
కరోనా టైంలో ‘శ్యామ్ సింగరాయ్’ మూవీపై భారీ బడ్జెట్ పెట్టడం రిస్కు అని సితార ఎంటర్టైన్మెంట్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీని నాని మరో నిర్మాతకు అప్పగించేందుకు సిద్ధపడుతున్నాడు. ఈ కథపై నానికి నమ్మకం కుదరడంతో వేరే నిర్మాతతో ఈ మూవీ చేసేందుకు నాని మొగ్గుచూపుతున్నాడట.
ప్రస్తుతం తనపై ఉన్న బ్యాడ్ రన్ పోవాలంటే ‘శ్యామ్ సింగరాయ్’ కథ అయితేనే బాగుంటుందని నాని భావిస్తున్నాడు. దీంతో భారీ బడ్జెట్ మూవీలను ఇప్పటివరకు చేయని ‘టాక్సీవాలా’ దర్శకుడికే నాని ఈ ప్రాజెక్టు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ కథపై ఎంతో నమ్మకం పెట్టుకున్న నానికి ఈ మూవీ విజయం అందిస్తుందో లేదో వేచిచూడాల్సిందే..!