
పెళ్లి అయ్యాక నా సగం జీవితం సంకనాకి పోయిందని అందరూ అంటారు. కానీ జీవితంలోనే అతంత్య కీలకమైన ఆ పెళ్లి తంతును ఎవరూ తప్పించుకోలేరు. కోట్లు సంపాదించినా.. జీవితంలో కష్టపడి ఎదిగినా పెళ్లి అనేది జీవితంలో పెద్ద మలుపు. మరి కెరీర్ లో స్థిరపడ్డ యువ హీరో అఖిల్ తన కెరీర్ ను సూపర్ గా సెట్ చేసుకున్నాడు. కానీ ఈ మ్యారీడ్ లైఫ్ ను మాత్రం సెట్ చేసుకోలేక కష్టపడుతున్నాడట..
యువ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు-వాసు వర్మ నిర్మిస్తున్నారు. ‘బొమ్మరిల్లు భాస్కర్’ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇప్పటికే సినిమా నుంచి ఫస్ట్ లుక్, సాంగ్ బయటకు వచ్చాయి. తాజాగా ఈ రోమాంటింట్ ఎంటర్ టైనర్ నుంచి ‘ప్రీ టీజర్ ’ రిలీజ్ చేశారు.
నా పేరు హర్ష అంటూ అఖిల్ తన బ్యాచ్ లర్ జీవితంలో కెరీర్ లో గొప్పగా ఎదిగానని.. కానీ 50శాతమైన మ్యారీడ్ లైఫ్ ను ఎలా సెట్ చేసుకోవాలో తెలయడం లేదని.. ఆగమాగం అవుతున్న ప్రీ టీజర్ విడుదలైంది. సో ఇది బ్యాచ్ లర్ల కష్టాలను ప్రతిబింబించేలా ఫన్నీగా రోమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ ఉండబోతోందని అర్థమవుతోంది.
అక్టోబర్ 25 ఉదయం 11.40 గంటలకు పూర్తి టీజర్ విడుదల చేస్తామని చిత్రం యూనిట్ ఈ ప్రీ టీజర్ లో తెలిపింది. 2021 సంక్రాంతి సీజన్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.