Buchi Babu : పాన్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్(Sukumar) … ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు… ఇక తన శిష్యులు సైతం ఇండస్ట్రీలో దర్శకులుగా మారి వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇంటలిజెంట్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్ (Sukumar)…ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే పుష్ప 2(Pushpa 2) సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన 1850 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పుష్ప రాజ్ అనే ఒక క్యారెక్టర్ ని సృష్టించి తనకంటూ ఒక సపరేటు ఐడెంటిటిని క్రియేట్ చేశాడు. ఇక ఈ సినిమాకి సిక్వెల్ గా పుష్ప 3 సినిమా కూడా రాబోతుంది. అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక సుకుమార్ శిష్యుడిగా ‘ఉప్పెన కి (Uppena) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకుడు బుచ్చిబాబు(Buchhi Babu)… ఈయన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ ను హీరోగా పెట్టి పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించి స్టార్ దర్శకుడిగా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ల గురువు అయిన సుకుమార్ గారి స్థాయిని అందుకోవాలి అంటే బుచ్చిబాబు ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది.
Also Read : బుచ్చిబాబు vs శ్రీకాంత్ ఓదెల వీళ్లలో టాప్ డైరెక్టర్ అయ్యేది ఎవరు..?
మరి ఈ సినిమా కనక భారీ విజయాన్ని సాధిస్తే బుచ్చిబాబు పాన్ ఇండియాలో టాప్ డైరెక్టర్ గా ఎదుగుతాడు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు మరో ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఆ హీరోలు ఎవరు అనే విషయాల పట్ల సరైన క్లారిటీ లేకపోయినప్పటికి ఈ విషయం మీద తను ఒక క్లారిటీ కి వచ్చి ఆ హీరోల పేర్లు చెబుతానని చెప్పడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా బుచ్చిబాబు తన తర్వాత మల్టీస్టారర్ సినిమాని చేయాలనుకోవడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇప్పటివరకు రామ్ చరణ్, ఎన్టీఆర్ లను హీరోలుగా పెట్టి రాజమౌళి తీసిన ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఆ రేంజ్ లోనే బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Raed : తనతో సినిమా చేయడం లేదని డైరెక్టర్ బుచ్చిబాబు ను స్విమ్మింగ్ పూల్ లోకి విసిరేసిన స్టార్ హీరో… వీడియో వైరల్…