Anna Lezhneva: కొందరు సెలబ్రిటీల( celebrities) విషయంలో అతిగా ప్రచారం జరుగుతుంది. ఇది చాలా సందర్భాల్లో చూశాం కూడా. తాజాగా పవన్ కళ్యాణ్ సతీమణి తిరుమలలో తలనీలాలు సమర్పించుకోవడం పై రకరకాల రచ్చ నడుస్తోంది. ఆమె సెలబ్రిటీ మహిళ కావడంతోనే ఈ రచ్చకు కారణం. ఇటీవల ఆమె కుమారుడు సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కించుకున్నాడు. ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఓ మాతృమూర్తిగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె తన తలనీలాలను సమర్పించుకున్నారు. ఏకంగా 17 లక్షల రూపాయలను టీటీడీకి విరాళంగా ఇచ్చారు. అది మొదలు ఈ ఘటనపై వింత ప్రచారం నడుస్తూ వస్తోంది. అయితే గతంలో తిరుమలలో చాలామంది మహిళలు తమ తలనీలాలను సమర్పించారు. చాలామంది ప్రముఖుల కుటుంబ సభ్యులు సైతం ఇలానే చేశారు. కానీ ఇప్పుడు పవన్ సతీమణి విషయంలో లేని ప్రచారానికి తెర లేపుతున్నారు.
Also Read: జగన్ హత్యకు ప్లాన్.. మాజీ ఐపీఎస్ సూత్రధారి.. ఆప్తుడి సంచలనం!
* కుమారుడి కోసం తలనీలాలు
సింగపూర్ లో ( Singapore)ఇటీవల పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన నుంచి క్షేమంగా బయటపడ్డారు ఆ బాలుడు. ఈ క్రమంలో ఆ బాలుడు తల్లి, పవన్ సతీమణి అన్నా లిజినోవా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడినందుకు ఆమె తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడికి తలనీలాలు సమర్పించారు. అనంతరం తిరుమలకు వచ్చిన భక్తులకు ఒక పూట అన్నదానం కోసం తన కొడుకు మార్కు శంకర్ పేరిట 17 లక్షల రూపాయల విరాళం సమర్పించారు. వాస్తవానికి ఆమె క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. రష్యాలో జన్మించిన ఆమె పుట్టుకతోనే క్రిస్టియన్. అయినప్పటికీ గుండు చేయించుకోవడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారి తీశారు. అయితే మహిళలు పుణ్యక్షేత్రాల వద్ద తలనీలాలు సమర్పించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. ఆధ్యాత్మిక ప్రవచనకర్తల అభిప్రాయంతో కూడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
* ప్రవచనకర్తల కామెంట్స్..
అయితే దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా పవన్( Pawan Kalyan) సతీమణి తలనీలాలు సమర్పించడం పై ఎవరికి తోచిన విధంగా వారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రవచనకర్తలు గరికపాటి, అనంతలక్ష్మి వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. గరికపాటి మాట్లాడుతూ ముత్తైదువలు తిరుమలలో మూడు కత్తెరలు ఇస్తే సరిపోతుంది. గుండు చేయించుకోవద్దంటూ మాట్లాడారు. ఈ వీడియోను ఇప్పుడు తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో ఇది సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. ఇక మహిళలకు తలనీలలు ఇవ్వొచ్చా అనే అంశంపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి మాట్లాడిన వీడియోను మరికొందరు పోస్ట్ చేస్తున్నారు. అందులో ఆమె ప్రసంగిస్తూ.. నా అహంకారం అంతా వదులుకుంటున్నాను. భగవంతుడు ఇచ్చిన అలంకారం జుట్టు. ఈ జుట్టును నీకు ఇచ్చి అందాన్ని వదులుకుంటున్నాను. అహంకారాన్ని వదులుకుంటున్నాను అనేది ఆడవాళ్లు జుట్టు ఇవ్వడంలో ఉన్న పరమార్థం. నీ దయ కోసం ఇంతకంటే కిందకు పడలేను అని అనంతలక్ష్మి చెప్పిన మాటలను పోస్ట్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయం పెద్ద చర్చగా మారింది.
* మరి ఆమె సంగతేంటి?
మరోవైపు పవన్ సతీమణిపై జరుగుతున్న ఈ ప్రచారంపై స్పందిస్తున్నారు జనసైనికులు( Jana Sena activist). గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన వీడియోను బయట పెడుతున్నారు. 2023 అక్టోబర్ లో తిరుమల వెళ్లిన కేసీఆర్ సతీమణి శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. అప్పుడు లేని నోరు ఇప్పుడు ఎలా లేస్తోందని జనసైనికులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. మొత్తానికైతే ఓ క్రిస్టియన్ మహిళ.. భగవంతుడిపై అభిమానంతో.. తన కుమారుడికి తప్పిన ప్రమాదంపై స్వామివారికి తలనీలాలు సమర్పిస్తే.. సంతోషించాల్సింది పోయి.. వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఆడ వాళ్ళు గుండు కొట్టించుకోకూడదు… గుండు కొట్టించుకుంటే అశుభం :- గరికపాటి నరసింహా రావు…
ఇంపార్టెంట్ : అన్నింటి కన్నా తల్లి ప్రేమ గొప్పది…పిల్లల కోసం తల్లి ఏమైనా చేస్తుంది pic.twitter.com/UXeMVvfeyy— Anitha Reddy (@Anithareddyatp) April 14, 2025