Bro Advance Bookings: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం మరో 6 రోజుల్లో మన ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ సాంగ్స్ ఒక్కటే అభిమానుల అంచనా కి తగ్గట్టుగా లేవు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి అవేమి అక్కర్లేదు, కేవలం ఆయన పేరు చాలు కనీవినీ ఎరుగని రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడానికి అని అభిమానులు ఊరికే ఎలివేషన్స్ కోసం వాడరు, అది ప్రాక్టికల్ గా నిరూపితమైంది కాబట్టే అంటారు.
ఈమధ్యనే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ ప్రాంతం లో మొదలయ్యాయి. ఓవర్సీస్ లో ఒక సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ జరగాలంటే కచ్చితంగా మంచి ట్రైలర్ కట్ ఉండాలి, లేకపోతే చార్ట్ బస్టర్ సాంగ్స్ అయినా ఉండాలి. ‘బ్రో’ చిత్రానికి ఈ రెండు లేకపోయినా కూడా అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.
ఇదంతా కేవలం పవన్ కళ్యాణ్ అనే పేరు మీద జరిగిన బుకింగ్స్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు,ట్రైలర్ విడుదలకు ముందే ఈ సినిమాకి అమెరికా లో లక్ష డాలర్లు వచ్చాయి. అలాగే లండన్ లో కూడా ఈ సినిమాకి 40 వేలకు పైగా డాలర్స్ వచ్చాయి,ఆస్ట్రేలియా, కెనడా వంటి ప్రాంతాలలో కూడా దుమ్ములేచిపోయే రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. మరి ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయి అని అభిమానులు సోషల్ మీడియా లో మూవీ మేకర్స్ ని ట్యాగ్ చేసి అడుగుతూ ఉన్నారు.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ మంగళవారం రోజు కానీ, లేదా బుధవారం రోజు కానీ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్ హైక్స్ మరియు అదనపు షోస్ ఈ సినిమాకి ఉండవని నిర్మాత రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. మరి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాక మన దగ్గర ఏ రేంజ్ ఓపెనింగ్ వస్తుందో చూడాలి.