Homeఎంటర్టైన్మెంట్Britney Spears- Sam Asghari: పెళ్ళి జరిగి ఏడాది కాక ముందే విడిపోతున్న బ్రిట్నీ స్పియర్స్,...

Britney Spears- Sam Asghari: పెళ్ళి జరిగి ఏడాది కాక ముందే విడిపోతున్న బ్రిట్నీ స్పియర్స్, సామ్ అస్గారి దంపతులు.. కారణమేంటంటే?

Britney Spears- Sam Asghari: ” ప్రిన్సెస్ ఆఫ్ పాప్” గా గుర్తింపు తెచ్చుకున్న స్పియర్స్ తన 16వ ఏట విడుదలైన బేబీ వన్ మోర్ టైమ్ తో సూపర్ స్టార్‌గా మారింది. ఇక ఆ తర్వాత ఆమె చేసిన టాక్సిక్, వుమనైజర్ మరియు అయ్యో!…ఐ డిడ్ ఇట్ ఎగైన్‌ లాంటి ఆల్బమ్స్ ఆమెకు మరింత క్రేజ్ పెంచాయి.
అయితే ప్రస్తుతం ఆమె తన భర్త సామ్ అస్గారి నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే ఇది బ్రిట్నీ స్పియర్ కు మొదటి పెళ్లి కాదు. తన చిన్ననాటి స్నేహితుడు చేసిన అలెగ్జాండర్ ని జనవరి 2004లో లాస్ వెగాస్ , నెవాడాలోని లిటిల్ వైట్ వెడ్డింగ్ చాపెల్‌లో వివాహం చేసుకుంది. అయితే ఆ పెళ్లి కేవలం 55 గంటలు మాత్రమే నిలిచింది ఆ తర్వాత బ్రిట్నీ విడాకులు తీసుకుంది. అదే సంవత్సరం ఆమె అమెరికన్ డాన్సర్, యాక్టర్, మోడల్ అయిన కెవిన్ ఫెడెర్‌లైన్ ను వివాహం చేసుకుంది. మూడు సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత 2007లో వీరిద్దరూ విడిపోయారు.

తిరిగి 15 సంవత్సరాల తర్వాత 2022లో అస్ఘరీ తో కొత్త మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేసిన స్పియర్స్ 14 నెలలు గడవకముందే డైవర్స్ కి సిద్ధపడుతోంది. ఇప్పుడు బ్రిట్నీ స్పియర్స్ వయసు 41 సంవత్సరాలు కాగా ఆమె భర్త అస్ఘరీ వయసు కేవలం 29 సంవత్సరాలు మాత్రమే.2016 లో స్పియర్స్ “స్లంబర్ పార్టీ” మ్యూజిక్ వీడియో సెట్‌లో కలుసుకున్న జంట 2022 లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు ఎన్నో సంవత్సరాలు లాంగ్ లైఫ్ ఎంజాయ్ చేసిన వీళ్లు పెళ్లి తర్వాత గట్టిగా సంవత్సరం కూడా ఉండలేకపోయారు.

ఈ ఇయర్ స్టార్టింగ్ లో ఈ జంట చేతికి పెళ్లి ఉంగరాలు లేకుండా కెమెరా కంటికి చిక్కినప్పటి నుంచి వాళ్ల ఇద్దరి జీవితం పై పలు రకాల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.గత మార్చి నుంచి ఈ జంట వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయి అన్న పుకార్లు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. కానీ ఇద్దరిలో ఎవరు దీని గురించి స్పందించకపోవడంతో అవి పుకార్లు గానే మిగిలిపోయాయి.

అయితే తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో “ఆరు సంవత్సరాల సుదీర్ఘమైన ప్రేమ మరియు ఒక సంవత్సరం పెళ్లి తర్వాత నేను నా భార్య ఈ బంధాన్ని ఇక్కడితో ఆపేయడానికి నిర్ణయించుకున్నాము” అని అస్ఘరీ పెట్టిన పోస్ట్ ద్వారా అఫీషియల్ గా వాళ్ళు విడిపోతున్న విషయం అందరికీ తెలిసింది. అయితే దీనికి బ్రిట్నీ “నేను కొత్త గుర్రాన్ని కొనుక్కోవాలి అనుకుంటున్నాను..”అని వెరైటీ పోస్ట్ రిప్లై గా పెట్టింది.

Bathini Surendar
Bathini Surendarhttp://oktelugu
Bathini Surendar is a Journlist and content writer with good Knowledge on News Writing. He is experience in writing stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular