spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8 : బ్రేకింగ్: బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ కంప్లీట్...

Bigg Boss Telugu 8 : బ్రేకింగ్: బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ కంప్లీట్ లిస్ట్ లీక్… హౌస్లోకి మీ ఫేవరెట్ బుల్లితెర స్టార్స్!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ షో కొన్ని నిబంధనలు, నియమాలు ఆధారంగా నిర్వహిస్తారు. హౌస్లోకి ప్రవేశించే కంటెస్టెంట్స్ ఎవరు అనేది గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ముగిసే వరకు బయటపెట్టరు. ఎంపికైన కంటెస్టెంట్స్ కి ఈ మేరకు సూచనలు చేస్తారు. తాము బిగ్ బాస్ షోకి వెళుతున్నట్లు ఎవరికీ చెప్పకూడదని అగ్రిమెంట్ లో పొందుపరుస్తారు. అయితే పలు కారణాల వలన కొందరు సెలెబ్స్ పేర్లు ముందుగానే లీక్ అవుతాయి.

బిగ్ బాస్ టీమ్ ఎంపికైన సెలెబ్స్ పై పరిచయ వీడియోలు చిత్రీకరించేందుకు వారి ఇళ్లకు, ఊళ్లకు వెళతారు. ఈ AV లు చిత్రీకరించడం వలన కూడా కంటెస్టెంట్స్ ఎవరనేది లీక్ అవుతుంది. ఆ AV లను ఎడిట్ చేసే టీమ్ సైతం లీక్ చేయవచ్చు. ఇలా పలు మార్గాల్లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరనే సమాచారం బయటకు వచ్చేసింది. కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంప్లీట్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీకైంది.

ఈ లిస్ట్ పరిశీలిస్తే మెజారిటీ కంటెస్టెంట్స్ లో టీవీ సెలెబ్స్ ఉన్నారు. ఇద్దరు ముగ్గురు సినిమా తారలు ఉన్నారు. లిస్ట్ పరిశీలిస్తే… నటి సన ఎంపికైందట. సన చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉంది. ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్. లాహిరి లాహిరి లాహిరిలో వంటి హిట్ మూవీలో నటించిన ఆదిత్యం ఓం హౌస్లో అడుగుపెడుతున్నాడట. జబర్దస్త్ నుండి ఈసారి లేడీ కమెడియన్ పవిత్ర వస్తుందట.

అలాగే జబర్దస్ మాజీ యాంకర్ సౌమ్యరావు సైతం ఛాన్స్ పట్టేసిందట. రీతూ చౌదరి ఈసారి హౌస్లో కనిపించడం ఖాయం అంటున్నారు. ఈసారి సీరియల్ నటులు అధిక మొత్తంలో కంటెస్ట్ చేస్తున్నట్లు లిస్ట్ చూస్తే అర్థం అవుతుంది. యాష్మి గౌడ, తేజస్వి గౌడ, నిఖిల్, అంజలి పవన్, ఇంద్రనీల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ గా ఎంపిక అయ్యారట.

ఇక సోషల్ మీడియా స్టార్ ఖాతాలో బెజవాడ బేబక్క ఎంట్రీ ఇస్తుందట. అలాగే బంచిక్ బబ్లు సందడి చేయనున్నాడట. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ కంప్లీట్ లిస్ట్ ఈ విధంగా ఉంది..

బెజవాడ బేబక్క
పవిత్ర
ఇంద్రనీల్
యాదమ్మ రాజు
సీత
సింగర్ సాకేత్
యష్మి గౌడ
సన
అంజలి పవన్
ఆదిత్య ఓం
బంచిక్ బబ్లు
సౌమ్యరావు
రీతూ చౌదరి
సుబ్బు
అభిరామ్ వర్మ
తేజస్వి గౌడ
నిఖిల్
వీరితో పాటు మరికొందరు సెలెబ్స్ ఎంపికయ్యారట. అయితే ఈ లిస్ట్ అంచనా మాత్రమే. సెప్టెంబర్ 1న గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ముగిస్తే కానీ అధికారికంగా ఎవరు కంటెస్ట్ చేశారు అనేది తెలియదు…

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version