Brahmanandam : బ్రహ్మానందం.. ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే 1200లకు పైగా సినిమాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆయన చాలా తక్కువగా సినిమాలను చేస్తున్నారు. సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన కెరీర్లో ఎన్ని సినిమాలు చేసినా బ్రహ్మానందం పెద్ద ఎత్తున్న ప్రమోషన్లలో పాల్గొన్నది లేదు. కానీ ఎన్నడూ లేని విధంగా తాజా బ్రహ్మానందం ఓ సినిమాకు మాత్రం తెగ ప్రమోషన్లు చేస్తున్నారు. ఆ సినిమానే బ్రహ్మ ఆనందం. తన కుమారుడు చాలా ఏళ్ల తర్వాత హీరోగా రీఎంట్రీ ఇచ్చిన చిత్రం ఇది. ఇందులో నటకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించడంతో అతడికి తాతగా చేసే అవకాశం బ్రహ్మానందంకు దక్కింది. పైగా తన పేరు మీదే టైటిల్ పెట్టి మార్కెటింగ్ నిర్వహించారు. పైగా తన కొడుకు సినిమానే కావడంతో పూర్తి బాధ్యత తన భుజాల మీదకు ఎత్తుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవినే స్వయంగా ఫోన్ చేసి మరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చారంటే దానికి కారణం కేవలం బ్రహ్మానందం మీద ఉన్న అంతులేని అభిమానమే. సినిమా విడుదలకు ముందు రోజే ప్రీమియర్లు వేశారు. అవుట్ డోర్ పబ్లిసిటీ విషయంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవన్నీ బాగానే జరిగిన ఆనందం అయితే యూనిట్ కు మిగిలింది కానీ.. సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద బ్రహ్మానందం కలిగించే విధంగా ఎలాంటి అద్బుతాలను చేయలేకపోయింది. ఇలాంటి సినిమాలకు మంచి సినిమానే అని పాజిటివ్ టాక్ వస్తే కమర్షియల్ గా పికప్ అందుకుని కాస్త కాసులు రాలుతాయి. కానీ డైరెక్టర్ ఆర్విఎస్ నిఖిల్ చాలా బరువున్న కథను డీల్ చేయడంలో కాస్త తడబడినట్లు కనిపిస్తుందని కొందరు ప్రేక్షకులు అంటున్నారు. కేవలం హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కోసమే థియేటర్లలకు వెళ్లే వారికి ఓకే కానీ కామెడీ, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ అన్నీ కావాలని కోరుకుని థియేటర్ కు వెళ్లిన వారికి మాత్రం తీవ్ర నిరాశే మిగుతులుందని చెబుతున్నారు. కాస్త డిఫరెంట్ గా ఉండాలని పెట్టిన ఓల్డ్ ఏజ్ ప్రేమకథ కూడా సినిమాకు ప్లస్ కాలేదు.
సినిమా రిజల్ట్ ఎలాగా బ్రహ్మానందం లాంటి లెజండరీ యాక్టర్ ను ఇంత లెన్త్ ఉన్న రోల్ లో మళ్లీ చూడడం సాధ్యమవుతుందో కాదు. సినిమాలో కొడుకు ఉన్నాడు.. కథ నచ్చింది కాబట్టి ఒప్పుకున్నారు కానీ లేదంటే వచ్చేది కాదేమో. ఇప్పటికే తెర మీద కనిపించడం బాగా తగ్గించేసిన బ్రహ్మానందం కేవలం కొన్ని నిముషాలు మాత్రమే ఉండే క్యామియోలు అవి కూడా చాలా సెలక్టివ్ గా చేస్తున్నారు. ఇప్పుడీ బ్రహ్మ ఆనందం సినిమా ఫలితాలు చూశాక మరింత జాగ్రత్త పడతారనేది నిజం. గౌతమ్ మాత్రం ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యారు.