Human Bodies Frozen
Human Bodies Frozen: సాధారణంగా ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు. వారికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఒక వేళ బంధువులు, కొడుకులు, కూతుళ్లు విదేశాల్లో ఉంటే వాళ్లు వచ్చేంత వరకు ఒకటి లేదా రెండు రోజుల పాటు అంత్యక్రియలు నిర్వహించకుండా ఫ్రీజర్ లో పెడతారు. ఇంకా లేటయితే ఆధునిక పరికరాలను ఉపయోగించి వారం లేదా 10 రోజుల వరకు డెడ్ బాడీని అంత్యక్రియలు నిర్వహించకుండా అలాగే ఉంచుతారు. కానీ ఇక్కడ మాత్రం సుదీర్ఘ కాలం పాటు డెడ్ బాడీలను భద్రపరుస్తున్నారు. అదేంటి అనుకుంటున్నారా..? ఎప్పుడైనా ప్రపంచ ఆధునిక వైద్యశాస్త్రం చనిపోయిన వారిని బతికించే విధంగా అభివృద్ధి చెందితే.. తమ ప్రియమైన వారిని కాపాడుకోవచ్చన్న ఉద్దేశంతో ఇక్కడ డెడ్ బాడీలను భద్రపరుస్తున్నారు. ఇందుకోసం ఓ కంపెనీ సైతం నిర్విరామంగా కృషిచేస్తుంది. స్కాట్స్‌డేల్‌లోని ఎడారి ప్రాంతంలోని అరిజోనా అనే నగరంలో 50 ఏళ్ల నుంచి 147 మెదళ్లు, డెడ్ బాడీలను స్టోర్ చేశారు. వాటిని లిక్విడ్ నైట్రోజన్ లో భద్రపరిచారు. ధర్మల్ స్లీపింగ్ బ్యాగుల్లో శవాలను ఉంచి అల్యూమినియం కేసుల్లో లిక్విడ్ నెట్రోజన్‌లో ఆ మృతదేహాలను భద్రపరిచారు. ఏదో ఒక రోజు సైన్ అభివృద్ధి చెందితే.. వాటిని తిరిగి బతికించుకోవచ్చన్న లక్ష్యంతో క్రయోప్రెజర్డ్ పద్ధతిలో ఇక్కడ భద్రపరుస్తున్నారు. డెడ్ బాడీని భద్రపరచడం కోసం అయ్యే ఖర్చు.. అక్షరాల 80లక్షల నుంచి దాదాపు కోటీ అరవైలక్షల వరకు అవుతుందట.
ఇక్కడ 50 ఏళ్లకు పైగా డెడ్ బాడీలను భద్రపరిచినట్లు ఆల్కోర్ కంపెనీ సీఈవో మాక్స్ మోర్ ప్రకటించారు. సైన్స్-ఆధునిక వైద్యంపై ఆశలు పెట్టుకుని యాంటీఫ్రీజ్‌తో శరీరాన్ని సంరక్షించే ఎక్సర్ సైజ్ మొదలుపెట్టినట్లు మాక్స్ మోర్ వెల్లడించారు. ఒక వ్యక్తి చనిపోయిన దగ్గర నుంచి తమ రెస్క్యూ ప్రారంభమవుతుందని మాక్స్ తెలిపారు. ఆల్కోర్ బృందం ఐస్ బాత్‌ను రెడీ చేసి, రోగి ఉష్ణోగ్రత గడ్డకట్టే స్థాయికి పడిపోయే వరకు 16 రకాల మందులు, యాంటీ-ఫ్రీజ్ విధానాన్ని అందిస్తుందని తెలిపారు. రెస్క్యూ ఎంత వేగంగా ప్రారంభిస్తామో.. శీతలీకరణ ప్రక్రియను అంతే వేగంగా ప్రారంభిస్తామని తెలిపారు. జర్మనీ, బ్రిటన్, కెనడాలలో సైతం ఆల్కోర్ స్టేషన్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే.. శరీరం మొత్తంతో పాటు అవయవాలకు విడివిడిగా కూడా తమ ప్యాకేజీ ఉంటుందని తెలిపారు. న్యూరో ఆప్షన్ సహా పలు రకాల ఎంపికలతో మృతదేహాన్ని భద్రపరుస్తామని పేర్కొన్నారు.
ఆల్కోర్‌లోకి వచ్చే ముందే “న్యూరో” ఆఫ్షన్ ఎంచుకుంటే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సర్జన్ రోగి తలను వేరు చేస్తారని… ఆ తర్వాత భద్రపరుస్తామని తెలిపారు. అవయవాల ప్రకారం అయితే ఇది చాలా చౌకైన మార్గమన్నారు. దీని ప్రారంభ ధర 80,000 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.70లక్షలు. ఇది మొత్తం శరీరాన్ని కాపాడుకోవడానికి అయ్యే ఖర్చులో సగం కంటే ఎక్కువ. దీనికి కనిష్టంగా $200,000(మన కరెన్సీలో కోటీ 75లక్షలు) అవసరమవుతుందని.. చాలా మంది వ్యక్తులు జీవిత బీమాతో చెల్లిస్తారని అని మోర్ చెపుకొచ్చారు. ప్రస్తుతం 500డెడ్ బాడీలు ఉన్నాయని వాటిని ప్రస్తుతం పూర్తి పర్యవేక్షణలో భద్రపరిచినట్లు తెలిపారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: They are hiding dead bodies after they die they say they will live
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com