Brahmamudi serial : స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి టీఆర్పీ తో దూసుకుపోతోంది. తక్కువ సమయంలోనే ప్రేక్షకాదరణ దక్కించుకుంటుంది. ముఖ్యంగా ఈ సీరియల్ లో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రాజ్, కావ్య పాత్రలకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. రాజ్,కావ్య పాత్రలు టామ్ అండ్ జెర్రీ వలె తరచుగా గొడవ పడుతుంటారు. ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. భార్యాభర్తల మధ్య ఈ గిల్లికజ్జాలు ప్రేక్షకులకు చక్కని వినోదం పంచుతున్నాయి.
ఆ పాత్రలు చేస్తున్న మానస్, దీపిక రంగరాజు ఆఫ్ స్క్రీన్ లో చాలా ఫ్రెండ్లీ గా ఉంటారు. తాజాగా బ్రహ్మముడి సెట్ లో మానస్ – దీపికా సీరియస్ గా గొడవ పడ్డారు. నువ్వా నేనా అంటూ కయ్యానికి కాలు దువ్వారు. ప్రస్తుతం ఈ కొట్లాట సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ వాళ్ళ మధ్య ఏం జరిగింది? అసలు గొడవకు కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే .. మానస్ ప్రస్తుతం నీతోనే డాన్స్ 2.0 లో పార్టిసిపేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ బ్యూటీ శుభశ్రీ తో కలిసి నీతోనే డాన్స్ లో పర్ఫార్మ్ చేస్తున్నాడు. ఇక విషయం గురించి మానస్ ఇంకా దీపిక గొడవపడ్డారు. మాటలతో పనిలేకుండా సైగలతోనే ఫైట్ చేసుకున్నారు. నీతోనే డాన్స్ 2.0 లో నన్ను ఎందుకు తీసుకోలేదు అంటూ దీపిక ..మానస్ తో గొడవకు దిగింది. ముందు డాన్స్ చేయడం నేర్చుకో అంటూ మానస్ రివర్స్ అవుతాడు. తనని జోడిగా తీసుకోనందుకు నాకు క్షమాపణ చెప్పు అని దీపిక కోరుతుంది.
కానీ మాత్రం మాత్రం నేను క్షమాపణ చెప్పను అని బదులిస్తాడు. దీంతో సీరియల్ లో చూసుకుందాం అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అయితే ఇదంతా వాళ్ళు సరదాగా ఓ రిల్ కోసం చేశారు. అంతే గాని నిజంగా మానస్-దీపికలు గొడవ పడలేదు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. రాజ్ బిడ్డకు తల్లి ఎవరు అని కనిపెట్టాలని కావ్య విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కావ్య నిజం ఎలా బయట పెడుతుందని సీరియల్ ఫ్యాన్స్ ఆతృతగా చూస్తున్నారు.