Brahmamudi: తల్లి చావు చివరి అంచుల వరకు వెళ్లేందుకు కారణమైందన్న నెపంతో భార్య కావ్యపై రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. తన జీవితంలో భార్యగా ఇకపై కావ్యకు స్థానం లేదంటాడు. ఆవేదనతో కావ్య పుట్టింటికి వెళ్ళిపోతుంది. అయితే రాజ్ తల్లి కోలుకుంటుంది. ఇంటికి వచ్చిన రాజ్ తల్లి, కావ్యను ఇంటికి తిరిగి తీసుకురావాలని పట్టుబడుతుంది. కావ్యను బ్రతిమిలాడి అత్తారింటికి తెచ్చేందుకు స్వయంగా రాజ్ నానమ్మ తాతయ్యలు వెళతారు.
కానీ కావ్య అత్తారింటికి వచ్చేందుకు నిరాకరిస్తుంది. అప్పుడు రాజ్ స్వయంగా వెళ్లి తీసుకురావాలని తల్లి పట్టుబడుతుంది. మరోవైపు కావ్య తిరిగి రాకుండా చేయాలని రుద్రాణి ఎత్తులు వేస్తూ ఉంటుంది. తల్లి గట్టిగా చెప్పడంతో ఇష్టం లేకపోయినా రాజ్ కావ్య ఇంటికి వెళతాడు. కావ్య-రాజ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. నా భార్యగా నటించడానికి ఎంత డబ్బు కావాలో అడుగని చెక్ బుక్ తీస్తాడు. కావ్యకు కోపం నషాళానికి ఎక్కుతుంది.
రాజ్ తిరిగి వెళ్ళిపోతాడు. కావ్య రానందని కుటుంబ సభ్యులకు చెబుతాడు. నువ్వు సరిగా పిలిచి ఉండవని రాజ్ తల్లి అసహనం వ్యక్తం చేస్తుంది. కావ్య తిరిగి రానందుకు కుటుంబ సభ్యులందరూ విచారం వ్యక్తం చేస్తారు. రుద్రాణి, తన కొడుకు మాత్రం లోలోపల సంతోషం అనుభవిస్తారు.
కట్ చేస్తే రాజ్ బెడ్ రూమ్ లో కావ్య కాఫీ కప్పుతో ప్రత్యక్షం అవుతుంది. రాజ్ ఆశ్చర్యపోతాడు. ఎప్పటిలాగే ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు చోటు చేసుకుంటాయి. కాసేపటికి ఉలిక్కిపడి లేస్తాడు. అది కల అని తెలుసుకుంటాడు. కాఫీ తెచ్చింది కావ్య కాదు, పని మనిషి అని అర్థం అవుతుంది. కావ్యను ఎలాగైనా తీసుకురావాలని పని మనిషి కూడా రాజ్ కి సలహా ఇస్తుంది. అందుకు రాజ్ కి చిర్రెత్తుకొస్తుంది.
మరోవైపు అప్పు-కళ్యాణ్ ఆర్థిక ఇబ్బందులు పడుతూనే, తమ సాన్నిహిత్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి మార్కెట్ కి వెళతారు. వారి ముందు సడన్ గా ఒక కారు ఆగుతుంది. కళ్యాణ్ కి విడాకులిచ్చి అతని జీవితంలో నుండి వెళ్ళిపోయిన, మాజీ భార్య అనామిక ప్రత్యక్షం అవుతుంది. కళ్యాణ్, అప్పు షాక్ అవుతారు. కనీసం తిరగడానికి కారు కూడా లేదా అని అనామిక వారిని ఎద్దేవా చేస్తుంది.
తనకు కాబోయే భర్త సామంత్ ని పరిచయం చేస్తుంది. దుగ్గిరాల వంశం వ్యాపారాలకు ప్రత్యర్థిగా ఉన్న సామంత్ జ్యువెలర్స్ అధినేతతో త్వరలో తన పెళ్లి అని చెబుతుంది. దుగ్గిరాల కుటుంబానికి చెందిన స్వరాజ్ గ్రూప్ ని త్వరలో నామరూపాలు లేకుండా చేస్తానని, వార్నింగ్ ఇస్తుంది. సామంత్ కి అప్పు సలహా ఇస్తుంది. ఈమెను నమ్ముకుంటే నీ బ్రతుకు రోడ్డున పడుతుందని, సూచిస్తుంది.
అత్తింట్లో ఉండాల్సిన కూతురు పుట్టినింట్లో ఉన్నందుకు కావ్య తల్లి కనకం వేదన చెందుతుంది. తన అసహనం భర్తపై చూపిస్తుంది. ఇక కావ్య లేకపోవడంతో పనిమనిషి వంట చేస్తుంది. ఆ వంటలు తినలేక రాజ్ ప్రాణానికి వస్తుంది. ఈ విధంగా ఎపిసోడ్ ముగిసింది.
Web Title: Brahmamudi serial september 20 episode
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com