https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్ 8’ లో కంటెస్టెంట్స్ మైక్ ధరించకపోతే భారీ జరిమానా.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

ఆగస్టు 15 న ఈ సీజన్ ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారు. గత సీజన్ 'ఉల్టా పల్టా' కాన్సెప్ట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే ఆ సీజన్ అంత సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : August 13, 2024 / 07:45 PM IST

    Bigg Boss 8 Telugu(5)

    Follow us on

    Bigg Boss 8 Telugu మరో మూడు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ కాబోతుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా బిగ్ బాస్ మేనియా నే కనిపిస్తుంది. గత రెండు నెలలుగా యూట్యూబ్ చానెల్స్ మొత్తం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల పై విశ్లేషణలు చేస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు కేవలం బిగ్ బాస్ గురించి మాత్రమే విశ్లేషణలు చేస్తున్నారంటే ఈ సీజన్ పై ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో మీరే ఊహించుకోండి. ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ మీ అందరికీ తెలిసిపోయే ఉంటుంది. నేటితో దాదాపుగా కంటెస్టెంట్స్ అందరితో అగ్రీమెంట్స్ మీద సంతకాలు కూడా చెయ్యించేసుకున్నారట బిగ్ బాస్ టీం.

    ఆగస్టు 15 న ఈ సీజన్ ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారు. గత సీజన్ ‘ఉల్టా పల్టా’ కాన్సెప్ట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే ఆ సీజన్ అంత సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సీజన్ లో కూడా అదే తరహాలో ఆలోచించి ‘ఇన్ఫినిటీ’ అనే కాన్సెప్ట్ తో మన ముందుకు రాబోతున్నారు. ‘ఇన్ఫినిటీ’ అనే అనంతం. ఎంటెర్టైమెంట్ అయినా, ఎమోషన్స్ అయినా, టాస్కులైనా, ఇలా ఏదైనా కానీ అన్ లిమిటెడ్ గా ఉండబోతుందని రీసెంట్ గా విడుదలైన రెండు ప్రోమోలను చూస్తే అర్థం అవుతుంది. ఇకపోతే ఈ సీజోన్లో రూల్స్ కూడా చాలా కఠినంగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. గత సీజన్ లో రైతు బిడ్డ అనే సెంటిమెంట్ ని వాడుకొని పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. అతని పైన ఏ కంటెస్టెంట్ గొడవకి దిగినా మొత్తం రైతులతో గొడవపడుతున్నట్టు, రైతులంటే చిన్న చూపు చూస్తున్నట్టు గా జనాల్లోకి వెళ్ళింది. ఆ ప్రభావం కారణంగా గత సీజన్ లో రన్నర్ గా నిల్చిన అమర్ దీప్ పై అన్నపూర్ణ స్టూడియోస్ లో దాడి జరిగిన సంగతి అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ సీజన్ లో అలాంటి సెంటిమెంట్స్ వాడుకుంటే భారీ జరిమానా తప్పదని బిగ్ బాస్ యాజమాన్యం కంటెస్టెంట్స్ కి చెప్పిందట.

    అలాగే గత సీజన్ లో కంటెస్టెంట్స్ మైకులను ధరించకుండా ఎన్నోసార్లు కనిపించిన సందర్భాలను మనం చూసే ఉంటాము. ఈసారి అలా చేస్తే ప్రతీ వారం వచ్చే రెమ్యూనరేషన్ లో 10 శాతం కోతలు విధిస్తారట . అలాగే గత సీజన్ లో నామినేషన్స్ సమయం లో అనేక మంది కంటెస్టెంట్స్ కంట్రోల్ తప్పి బూతులు మాట్లాడడం మనమంతా చూసాము. కానీ ఈసారి అలా మాట్లాడితే రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపేంత కఠినమైన రూల్స్ ఉంటాయని తెలుస్తుంది. ఇలా ఎన్నో నిబంధనలతో కూడిన అగ్రీమెంట్స్ మీద సంతకం చేసిన తర్వాతనే కంటెస్టెంట్స్ ని ఖారారు చేశారట. కాబట్టి ఈ సీజన్ అన్నీ సీజన్స్ లాగ ఉండదు అనే విషయం ఆడియన్స్ కి అర్థమైంది. త్వరలోనే ఈ సీజన్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు బయటకి రానున్నాయి.