Homeఎంటర్టైన్మెంట్Brahmaji Manchu Vishnu Land Statement: మంచు విష్ణు న్యూజిలాండ్ లో కొన్న 7వేల ఎకరాలు..అసలు...

Brahmaji Manchu Vishnu Land Statement: మంచు విష్ణు న్యూజిలాండ్ లో కొన్న 7వేల ఎకరాలు..అసలు నిజం బయటపెట్టిన నటుడు బ్రహ్మాజీ!

Brahmaji Manchu Vishnu Land Statement: మంచు కుటుంబం లో ఆస్తుల విషయంలో గత కొంత కాలంగా ఎలాంటి గొడవలు జరుగుతున్నాయో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. మంచు మనోజ్(Manchu Manoj) చేస్తున్న పోరాటం కూడా మనకి విదితమే. అయితే తాను ఆస్తి కోసం గొడవపడటం లేదని, ఆత్మగౌరవం కోసం మాత్రమే పోరాటం చేస్తున్నానని మంచు మనోజ్ ఇది వరకే క్లారిటీ ఇచ్చాడు. కానీ పైకి అలా చెప్తున్నాడు కానీ, వీళ్ళ మధ్య జరుగుతున్నది ఆస్తుల పంపకాలకు సంబంధించిన వివాదమే అని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకు కారణం రీసెంట్ గానే ఒక వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడమే. ఆ వీడియో మోహన్ బాబు(Manchu Mohan Babu) కన్నప్ప మూవీ(Kannappa Movie) షూటింగ్ సమయం లో చేసినది. ఆయన పక్కనే మంచు విష్ణు(Manchu Vishnu) తో పాటు ప్రభుదేవా(Prabhu Deva), ముకేశ్ రుషి, బ్రహ్మాజీ మరియు ఇతర నటీనటులు కూడా ఉన్నారు.

ఈ వీడియో లో మోహన్ బాబు మాట్లాడుతూ ‘ఈ 7 వేల ఎకరాలు నా ప్రాపర్టీ నే. ఆ కొండలు కూడా మావే, మంచు విష్ణు కోసం కొనుగోలు చేశాము’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో బాగా వైరల్ అవ్వడంతో ఆస్తుల కోసమే మంచు కుటుంబం లో చీలికలు వచ్చాయి అంటూ కొంతమంది ప్రచారం చేశారు. దీనిపై నటుడు బ్రహ్మాజీ స్పందిస్తూ ‘ఓరి బాబు..అది మేము సరదాగా చేసిన వీడియో. మోహన్ బాబు గారు ఆరోజు చాలా సంతోషమైన మూడ్ లో ఉన్నాడు. మేము కలిసినప్పుడు ఎప్పుడూ ఇలాగే సరదాగా జోకులు వేసుకుంటూ ఉంటాము. మోహన్ బాబు గారిని ఆటపట్టించడం అంటే మాకు సరదా. దీనిని కూడా సీరియస్ గా తీసుకొని ఇలాంటి ప్రచారం చేశారా’ అంటూ బ్రహ్మాజీ ట్విట్టర్ ద్వారా ఒక ట్వీట్ వేశాడు. ఇది బాగా వైరల్ అయ్యింది. అయినా ఆ వీడియో చూస్తుంటే మోహన్ బాబు సరదాగానే ఆ కామెంట్స్ చేశాడని స్పష్టంగా అర్థం అవుతుంది.

Also Read:  Brahmaji And Hyper Aadi: బ్రహ్మాజీ వెనకనుంచి హైపర్ ఆది చేసిన పని… వైరల్ వీడియో

అయినప్పటికీ కూడా ఇలాంటి ప్రచారం చెయ్యాలనే ఆలోచన ఎలా వచ్చిందో అర్థం కావడం లేదంటూ కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. అంతే కాకుండా గత వారం విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కన్నప్ప చిత్రం ఈ రేంజ్ లో ఉంటుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని ట్రైలర్ కలిగించింది. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాబోతున్నాయి. ప్రభాస్(Rebel Star Prabhas) ప్రెజెన్స్ ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ ని తెచ్చిపెడుతాయనే బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version