Trending Political Videos India: రాజకీయ నాయకులకు భాష విషయంలో హుందాతనం అనేది లేకుండా పోతుంది. ముఖ్యంగా ప్రత్యర్థులను విమర్శించే సమయంలో నాయకులు సమయమనం కోల్పోతున్నారు. తాము మనుషులమే అనే విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు..
తెలంగాణలో రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ నాయకుల మాదిరిగా తిట్ల పురాణాన్ని.. బూతుల దండకాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రత్యర్థులపై రాయలేని విధంగా.. చెప్పలేని విధంగా విమర్శలు చేస్తున్నారు. ఫలితంగా రాజకీయాలనేవీ హుందాతనాన్ని కోల్పోతున్నాయి. బూతుల పర్వంగా, తిట్ల దండకంగా మారిపోతున్నాయి. ఇది ఎంతవరకు దారి తీస్తాయి.. ఎంతకు దిగజారుతాయో అర్థం కావడం లేదని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుల వ్యవహార శైలి వల్ల టీవీ చూడాలంటే, సోషల్ మీడియా సర్ఫింగ్ చేయాలంటేనే భయంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆందోళనకు తగ్గట్టుగానే, వారి భయానికి తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నిజామాబాదు పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థి పార్టీ నాయకులను విమర్శించే క్రమంలో ఆయన లైన్ దాటి వ్యవహరించారు. వ్యక్తిగతంగా విమర్శలకు దిగి.. తెలంగాణలో రాజకీయాలు గొప్పగా లేవని.. అది కూడా పతనావస్థకు చేరాయని నిరూపించారు.
Also Read: New Emergency Number Telangana: తెలంగాణలో ఏకీకృత అత్యవసర సేవలు.. అందుబాటులోకి కొత్త నంబర్
ఇష్టానుసారంగా విమర్శలు
కెసిఆర్ అవినీతి చేస్తే చేశాడని నిరూపించాలి. కవిత అక్రమాలకు పాల్పడితే అక్రమాలను బయట పెట్టాలి. హరీష్ రావు అడ్డగోలు వ్యవహారాలకు శ్రీకారం చుడితే వాటిని ప్రజలకు నిరూపించాలి. కేటీఆర్ దందాలకు పాల్పడితే వాటిని బయట పెట్టాలి. ధర్మపురి అరవింద్ తమ ప్రత్యర్థి పార్టీగా భారత రాష్ట్ర సమితి భావిస్తున్న నేపథ్యంలో పైపనులు కచ్చితంగా చేయాలి. అవి చేసినప్పుడు ఆయనకు ప్రజల్లో మరింత గౌరవం పెరుగుతుంది. ఆయన స్థాయి మరింత పటిష్టమవుతుంది. అయితే ఇవన్నీ మర్చిపోయి ధర్మపురి అరవింద్ కేసీఆర్, ఆయన పార్టీలో నాయకులను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం.. ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఆరోపణలకు దిగడం సంచలనం కలిగిస్తోంది. “గద్ద ముక్కోడిని కాలేశ్వరంలో.. బిడ్డ లిక్కర్ స్కాం లో.. ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్ లో.. విద్యుత్ స్తంభం లేక పొడుగ్గా ఉండేటోడు విద్యుత్ స్కాంలో.. వీళ్ళందర్నీ గప్ప గప్పగుద్ది.. రప్ప రప్ప జైల్లో వేయాలని” ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు చేశారు. ఇవి తమిళం పార్టీ నాయకులకు ఆ క్షణం వరకు ఆనందాన్ని కలిగిస్తాయి గానీ.. అటువంటి వ్యాఖ్యలను వినేవారికి.. చూసేవారికి ఇబ్బందికరంగానే ఉంటాయి. ఎందుకంటే రాజకీయాలనేవి వ్యక్తిగత సంబంధాల లాంటివే. రాజకీయాల కోసం ముఖ్యంగా పదవుల కోసం ప్రత్యర్థి నాయకులను అడ్డగోలుగా తిట్టడం.. ఇష్టానుసారంగా విమర్శలు చేయడం మంచి పరిణామం అనిపించుకోదు. ఎందుకంటే రాజకీయాలు కాలాతీత వ్యవస్థలు అసలు కావు. అవి మనిషి జీవితంలో ఒక భాగమే. ఈ విషయాన్ని ధర్మపురి అరవింద్ మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులు కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. భారత రాష్ట్ర సమితి నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ వరకు అందరికీ ఇదే వర్తిస్తుంది.
ఇదేం భాష..
గద్దముక్కోడును కాళేశ్వరంలో, బిడ్డ లిక్కర్ స్కాంలో, ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లో.. విద్యుత్ స్తంభం లెక్క పొడుగ్గ ఉండెటోడు విద్యుత్ స్కాంలో..
వీళ్లందర్నీ గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైళ్లో వెయ్యాలి- బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ pic.twitter.com/DMg2WuOoXY
— greatandhra (@greatandhranews) June 23, 2025