సాక్షి మాలిక్ స్టైల్, గ్లామర్ తో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఆమె సాధారణ దుస్తులు ధరించి, ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలుస్తుంది.
బాలీవుడ్లో త్వరగానే పేరు తెచ్చుకున్న నటి సాక్షి మాలిక్.
ఆమె పోటోలతో చేసే ప్రదర్శనలు, స్టైలిష్ కు పెట్టింది పేరుగా నిలుస్తుంటుంది.
సోను కే టిటు కి స్వీటీ చిత్రంలో ఈమె నటించిన పాత్రకు ఎంతో మంది ఫిదా అయ్యారు.
2018 లో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఆమెకు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది.
ఇందులో సాక్షి పాత్ర చాలా మంది అభిమానులకు గుర్తుండిపోయింది.
ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, నుష్రత్ భారుచా, సన్నీ సింగ్ వంటి ప్రముఖ నటులు నటించారు.
ఈ చిత్రానికి లవ్ రంజన్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 23, 2018న విడుదలైన తర్వాత మంచి స్పందన ను అందుకుంది.