Boyapati Srinu- Pawan Kalyan: అఖండ మూవీతో బోయపాటి శ్రీను ఇమేజ్ మరింత పెరిగింది. ఈ మాస్ చిత్రాల దర్శకుడు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చారు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన భద్ర, సింహా, లెజెండ్ భారీ విజయాలు సాధించాయి. ఒక హీరోయిన్ ఊరమాస్ గా ప్రెజెంట్ చేయాలంటే బోయపాటి తర్వాతే. బలమైన కథలో దుమ్మురేపే యాక్షన్ ఉంటుంది. ఇక ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ లేపే డైలాగ్స్ అయితే కొదవే ఉండదు. కాగా పవన్ కళ్యాణ్- బోయపాటి కాంబినేషన్ లో మూవీ సెట్ చేయాలని నిర్మాత డివివి దానయ్య అనుకున్నారట.
గబ్బర్ సింగ్ మూవీతో పవన్ ఫుల్ ఫార్మ్ లోకి వచ్చారు. టాలీవుడ్ రికార్డ్స్ తిరగరాసిన ఆ చిత్రం ఫ్యాన్స్ కి గొప్ప అనుభూతిని పంచింది. ఈ మూవీ అనంతరం నిర్మాత దానయ్య పవన్ ని కలిసి సినిమా చేద్దాం అన్నారట. ఆయన దర్శకుడిని సిద్ధం చేయండి అన్నారట. బోయపాటి శ్రీను వద్ద కథ ఉందని తెలిసి దానయ్య కలిశారట. పవన్ కళ్యాణ్ ని కలిసి బోయపాటి కథ చెప్పారట. కథ నచ్చినప్పటికీ తన బాడీ లాంగ్వేజ్ కి సరిపోయేలా లేదని, పవన్ మార్పులు సూచించారట.
కొద్దిరోజుల తర్వాత బోయపాటి మరలా పవన్ ని కలిశారట. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సంతృప్తి చెందలేదట. ఈ కథ నాకు సూట్ కాదు. బాలయ్య వంటి మాస్ ఇమేజ్ కలిగి హీరోలు చేస్తే బాగుంటుందని అన్నారట. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ దర్శకుడు పూరి జగన్నాధ్ తో కెమెరా మెన్ గంగతో రాంబాబు చిత్రానికి కమిట్ అయ్యారట. ఆ విధంగా బోయపాటి-పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదట.
ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ రోల్ చేస్తే చూడాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బోయపాటి అందుకు సమర్థుడని బావిస్తున్నారు. అయితే వారి కోరిక నెరవేరలేదు. భవిష్యత్ లో పవన్-బోయపాటి మూవీ సాకారం కావచ్చు. అవకాశాలు కొట్టిపారేయలేం. ఇక ప్రస్తుతం పవన్ నాలుగు చిత్రాలు చేస్తున్నారు. హరి హర వీరమల్లు, ఓ జీ, ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై ఉన్నాయి. బ్రో పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. జులై నెలలో విడుదల కానుంది.