Vivo Y-36: యువకుల అభిరుచులు.. అప్డేట్ వెర్షన్లను కోరుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో స్మార్ట్ ఫోన్ల కంపెనీలు వినియోగదారులకు అనుగుణంగా ఫీచర్లను అప్డేట్ చేస్తూ కొత్త మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇవి ఆకర్షించే కలర్, మోడల్ లో ఉండడంతో చాలా మంది వీటి కొనుగోలుకు ఆసక్తిచూస్తున్నారు. లేటేస్టుగా ఫాస్టెస్ట్ చార్జింగ్, అదిరిపోయే ఫీచర్లను జోడించి కొత్త మొబైల్ ను ప్రముఖ కంపెనీ రిలీజ్ చేసింది. దీని ధర కూడా తక్కువగానే ఉండడంతో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ మొబైల్ ఏదంటే?
వివో కంపెనీకి చెందిన మొబైల్స్ ఇప్పటికే ఇండియాలో విస్తరించాయి. వీటిని షో రూంలతో పాటు ఈ స్టోర్ల నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు. వివో నుంచి వై-36 అనే మోడల్ లేటేస్టుగా ఆకర్షిస్తోంది. ఇటీవలే దీనిని లాంచ్ చేయగా దీని ఫీచర్లు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫోన్ల కంటే అడ్వాన్స్ డ్ గా వర్క్ చేయడంతో పాటు అదనంగా ప్రత్యేక సదుపాలు ఇందులో ఉన్నాయి.
వై -36 మొబైల్ 2.5 డీ కర్వ్ డ్ గ్లాస్ తో ప్యాక్ చేయబడింది. స్నాప్ డ్రాగన్ 680 ఎఉస్పోచీ చిప్ సెట్ ను ఇందులో అమర్చారు. 5,000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ కలిగిన ఇది 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. వీవో వై-36 లో 8 జీబీ రామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది. ఈ మొబైల్ గోల్డ్, బ్లాక్, వైబ్రంట్ కలర్లలో అందుబాటులో ఉంది. డ్యూయెల్ సిమ్ ఆప్షన్ తో పాటు ఓఎస్ 13 వర్సన్ ఇందులో ఇన్ స్టార్ చేసుకోవచ్చు. 240 హెర్ట్స్ టచ్ శాంప్లింగ్ రేట్ తో 6.64 హెచ్ డీ డిస్ ప్లే దీని సొంతం.
ఇక ఈ మొబైల్ ను సొంతం చేసుకోవాలంటే రూ.16,999 చెల్లించాలి. అన్ని మొబైల్ షోరూంలతో పాటు ఈ స్టోర్లలో లభిస్తుంది. హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు డెబిట్ కార్డుపై దీనిని కొనుగోలు చేస్తే రూ.1500 క్యాష్ బ్యాక్ వస్తుంది. మొత్తం ఒకేసారి చెల్లించే వీలు లేకపోతే ఈఎంఐ ఆఫ్షన్ల ద్వారా కొనుగోలు చేసిన క్యాష్ బ్యాక్ ఆఫర్ వస్తుంది. ఎస్పీఐ కార్డ్ తో కొనుగోలు చేయాలనుకుంటే.. అదనంగా రూ.500 క్యాష్ బ్యాక్ వస్తుంది.