Boyapati Srinu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లు ఎంతమంది ఉన్నా బోయపాటి శ్రీనుకి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. భద్ర సినిమా నుంచి మొన్న వచ్చిన ‘అఖండ 2’ సినిమా వరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తు సినిమాలను చేస్తాడు. అందులో అతని ఎమోషన్స్ , ఎలివేషన్స్ ను బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకుడి చేత శభాష్ అనిపించుకున్న దర్శకుడు కూడా బోయపాటి శ్రీను నే కావడం విశేషం… బోయపాటి సినిమాల్లో రొటీన్ కంటెంట్ ఉంటుంది. ఇక దాంతోపాటుగా ఫిజిక్స్ ని అసలు ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా ఫైట్స్ ను కంపోజ్ చేస్తు ఉంటాడు. బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో ఫైట్స్ కి ప్రాధాన్యం ఇస్తూ సినిమాలను ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ లోకి వెళ్తున్న క్రమంలో బోయపాటి తన పంథా ను మార్చుకొని సినిమాలను చేస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
కారణమేంటంటే బోయపాటి సినిమాలు రొటీన్ రొట్ట ఫార్ములాలో ముందుకు సాగుతున్నాయి. ఇక పాన్ ఇండియా, పాన్ వరల్డ్ ప్రేక్షకులను మెప్పించడానికి మన దర్శకులు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంటే బోయపాటి మాత్రం ఇంకా అదే మార్కుని పట్టుకుని ఎన్ని రోజులు సినిమాలను చేస్తాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
సినిమా యావరేజ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు సాగుతోంది. ఈ సినిమాని చూడడానికి చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు. కానీ ఇప్పటికైనా బోయపాటి శ్రీను టెక్నాలజీ ని వాడుకొని కొత్త కాన్సెప్ట్ లను చేస్తే బాగుంటుంది. లేకపోతే ఆయన కెరియర్ ప్రమాదం లో పడిపోయే అవకాశమైతే ఉంది…
రాబోయే రోజుల్లో ఆయన చేయబోతున్న సినిమాల్లో కంటెంట్ ఏ రేంజ్ లో ఉంటుంది. గ్రాఫికల్ సినిమాలను చేయగలిగే కెపాసిటి తనకు ఉందా? కేవలం మాస్ ప్రేక్షకులను అలరిస్తూ కమర్షియల్ సినిమాలను చేస్తూ కెరియర్ ను కోల్పోతాడా? అనేది తెలియాల్సి ఉంది…