Motorola Edge 60 Fusion 5G: ప్రస్తుత కాలంలో మొబైల్ రంగంలో Motorola కంపెనీ కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చి వినియోగదారులను ఇంప్రెస్ చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా Motorola Edge 60 Fusion 5G ని లాంచ్ చేసింది. మిడ్ రేంజ్ వినియోగదారులకు అనుగుణంగా ఫీచర్లతో పాటు సరసమైన ధరకు అందించేలా మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా Display తోపాటు అద్భుతమైన కెమెరా ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీడియోతో పాటు గేమింగ్ కోసం.. ఫోటోగ్రఫీ వారికోసం ఈ మొబైల్ అనుగుణంగా ఉంటుందని చర్చ సాగుతోంది. మరి ఈ మొబైల్ ఎలా ఉంది? ఇందులో ఎంతవరకు Display ఉంది? ధర ఎంత? పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇప్పటివరకు Motorola కంపెనీ నుంచి వచ్చిన మొబైల్స్ కంటే లేటెస్ట్ గా వచ్చిన Motorola Edge 60 Fusion 5G ని ఎక్కువగా లైక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇందులో ప్రధానంగా కెమెరా గురించి ఎక్కువగా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ప్రధాన కెమెరా 200 MP తో పని చేస్తుంది. అల్ట్రా హై రిజర్వేషన్ సెన్సార్ తో పాటు అసాధారణమైన ఫోటోగ్రఫీ అందిస్తుంది. యూత్ తో పాటు కొత్తగా ఫోటోగ్రఫీ కంటెంట్ సృష్టించే వారికి ఈ కెమెరా అనుగుణంగా ఉంటుంది. ప్రతి షాట్ కు లైటింగ్, కలరింగ్ అనుకున్న విధంగా ఆప్టిమైజ్ చేస్తుంది. ఈ ఫోటోలకు ఏఐ మెరుగుతలను కూడా చేసుకోవచ్చు. ఫోటోతోపాటు వీడియోలకు కూడా ఈ కెమెరా అద్భుతమైన చిత్రీకరణ చేస్తుంది.
ఈ మొబైల్ Display గురించి కూడా ప్రధానంగా చెప్పుకోవాలి. ఇందులో 6.7 అంగుళాల Poled Display ఉండడంతో వైబ్రేట్ కలర్స్, డీప్ బ్లాక్ తోపాటు అత్యధిక కాంట్రాస్ట్ తో ఉంటుంది. సోషల్ మీడియా కోసం ఎక్కువగా ఉపయోగించే వారికి ఇది అనుగుణంగా ఉంటుంది. HDR సపోర్టుతో రిఫ్రెష్ రేటు తో Display Fluid యానిమేషన్ తో పాటు అద్భుతమైన దృశ్యం కావాలని అనుకునేవారు దీనిని ఉపయోగించవచ్చు.
ప్రస్తుత కాలంలో మొబైల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇందుకోసం బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా కావాలని అనుకునే వారికి Motorola Edge 60 Fusion 5G ఫుల్ సపోర్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో 5,500mAh అమర్చారు.68 వాట్ చార్జింగ్ తో ఎక్కువ సామర్ధ్యాన్ని ఇస్తుంది. ఫాస్టెస్ట్ చార్జింగ్ ఉండడంతో ఎక్కువసేపు వినియోగించుకోవచ్చు. అలాగే డౌన్ టైం తగ్గేలా చేస్తుంది. రోజంతా మొబైల్ ఆధారపడినా చార్జింగ్ ఎక్కువసేపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ మొబైల్ 5g కనెక్ట్ కావడంలో నెరవేరా పనితీరు చేస్తుంది. ఇందులో యాప్ లు కావలసినన్ని వాడుకున్నా.. వేగవంతమైన డౌన్లోడ్ కోసం ఫైవ్ జి సూపర్ ఫాస్ట్ గా పనిచేస్తుంది. భారతదేశమంతా 5జి నెట్వర్క్ ఎక్కువగా ఉండడంతో ఈ మొబైల్ అనుగుణంగా ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుతం మార్కెట్లో దీనిని రూ.19,999 తో విక్రయిస్తున్నారు. రూ.21,540 వరకు హై ఫీచర్లతో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ లో ఈ ప్రోడక్ట్ అందుబాటులో ఉంది. అయితే బ్యాంకు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి ఆఫర్లు కూడా వర్తిస్తాయి.