Boyapati and Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటు ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటున్నాయి. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాలతో పెను ప్రభంజనాలను సృష్టిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం 70 సంవత్సరాలు వయసులో కూడా వశిష్ట డైరెక్ష లో విశ్వంభర (Vishwambhara) అనే సినిమా చేస్తూ తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆయన చేస్తున్న సినిమాలు ఇక మీదట చేయబోతున్న సినిమాలు మనకు మరొక ఎత్తులో ఉండబోతున్నాయట. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి మాస్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక మీదట అంతకుమించిన ఐడెంటిటీ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో భారీ గుర్తింపును సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఎంటైర్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకునే ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి కూడా కమిట్ అయ్యాడు. ఇక ఇలాంటి క్రమం లోనే వీళ్ళ కాంబో లో రాబోయే సినిమా చాలా హైలెట్ గా నిలువబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దానికి ఏమాత్రం తగ్గకుండా ఆయన ఈ సినిమాని చేసి భారీ విజయాన్ని అందుకుంటానని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చిరంజీవి బోయపాటి శ్రీను డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
Also Read : రామ్-బోయపాటి సినిమాలో జై బాలయ్య… పాన్ ఇండియా అంటూ ఇవేం ప్రయోగాలు బాబోయ్!
మరి ఈ సినిమాతో ఆయన పెను ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా మాస్ హీరోగా మారబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఎప్పటి నుంచి సినిమా వస్తుంది అంటూ వార్తలు వస్తున్నప్పటికి ఆ సినిమా ఇప్పటివరకు పట్టాలైతే ఎక్కలేదు.
ఇక రామ్ చరణ్ తో బోయపాటి శ్రీను చేసిన ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ అవ్వడంతో చిరంజీవి అతనితో సినిమా చేయాలనే నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాలకు మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉంది. ఇక బాలయ్య బాబుతో చేస్తున్న అఖండ 2 (Akhanda 2)భారీ విజయాన్ని సాధిస్తుందనే కాన్ఫిడెంట్ తో ఉన్నాడు.
కాబట్టి తన తదుపరి సినిమాని కూడా అలానే చేయాలనే ఉద్దేశ్యంలో చిరంజీవి ఉన్నాడట. ఇక ఇప్పటికే బోయపాటి సైతం చిరంజీవికి ఒక కమర్షియల్ కథతో కూడిన లైన్ కూడా వినిపించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ లైన్ కి చిరంజీవి కట్టుబడి ఉండి ఆ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read : బోయపాటి శ్రీను దర్శకత్వం లో సినిమాలను చేసి దెబ్బ తిన్న స్టార్ హీరోలు వీళ్లే…