Box Office Report: గత నెల రోజులుగా టాలీవుడ్ సక్సెస్ ట్రాక్ లో ఉంది. ముందుగా ఈ ట్రాక్ లోకి వచ్చిన బింబిసార బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల నుంచి యూఎస్ఏ వరకు భారీ వసూళ్లను నమోదు చేసింది. కళ్యాణ్ రామ్ సినిమా సక్సెస్‌తో ‘బింబిసార’ వేడుకులు చేసుకుంది. కళ్యాణ్ రామ్ టీం స్పెషల్ ట్రీట్ ఇచ్చి మరీ తమ ఆనందాన్ని పంచుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన కార్తికేయ 2 సాధిస్తున్న భారీ కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సక్సెస్ ట్రాక్ లో నేను ఉన్నాను అంటూ నేడు వచ్చిన లైగర్ పరిస్థితి అసలు బాగాలేదు. ఈ సినిమా డిజాస్టర్ టాక్ తో భారీగా డిజ్పాయింట్ చేసింది.

అయితే, ‘బింబిసార’ వర్సెస్ ‘కార్తికేయ 2’ కలెక్షన్స్ విషయానికి వస్తే.. లైగర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా దారుణమైన కలెక్షన్స్ ను రాబట్టింది.
లైగర్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర 70 % మాత్రమే ఆక్యూపెన్సీని సాధించింది. ముఖ్యంగా ఆంధ్ర లో బాగా దెబ్బ పడింది. ఇక నైజాంలో రికార్డ్ కలెక్షన్స్ తో రచ్చ చేస్తాడు అనుకుంటే.. ఇక్కడ కూడా లైగర్ బాగా తేలిపోయాడు.
‘బింబిసార’, ‘కార్తికేయ 2’ సినిమాల కలెక్షన్స్ కంటే.. లైగర్ కి తక్కువ కలెక్షన్స్ రావడం విశేషం. రెండు రాష్ట్రాల్లో
బింబిసార’ రూ. 11.70 కోట్ల షేర్ రాబడితే, ‘కార్తికేయ 2’ రూ. 7.80 కోట్ల షేర్ రాబట్టింది. కానీ లైగర్’ రూ. 7.14 కోట్లు వసూలు చేశాడు. ఓవరాల్ గా బింబిసార మొదటి రోజు సినిమా 12 కోట్ల నుండి 14 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా… లైగర్ మొదటి రోజు సినిమా 7 కోట్ల నుండి 11 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.

ఇక కార్తికేయ 2’ విషయానికి వస్తే.. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 6 కోట్ల నుండి 7 కోట్ల రేంజ్ షేర్ అందుకోనుంది. మొత్తమ్మీద బింబిసార, ‘కార్తికేయ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించాయి. కానీ లైగర్ మాత్రం ఈ విజయాల్లో సగం కూడా సాధించ లేకపోయింది. కానీ, పేరుకు మాత్రం పాన్ ఇండియా సినిమా అంటూ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది.

