Telugu Movies Box Office : ఈ వారం సినిమాల పై గ్రౌండ్ రిపోర్ట్ !

Telugu Movies Box Office: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అనంతరం తెలుగు బాక్సాఫీస్ (Box Office) వద్ద ప్రస్తుతం వరుస సినిమాల హడావుడి కొనసాగుతోంది. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిబంధనల మేరకు సినిమాలను ప్రదర్శిస్తునప్పటికీ.. సినిమాల రిలీజ్ విషయంలో మాత్రం పోటీ అసలు తగ్గడం లేదు. మరి ఈ నెల చివరి వారంలో కూడా థియేటర్‌ ల్లో సందడి చేయబోతున్న సినిమాల పరిస్థితి ఏమిటో చూద్దాం. ముందుగా ఈ వారం సినిమాల్లో కాస్త అంచనాలు […]

Written By: admin, Updated On : August 23, 2021 1:54 pm
Follow us on

Telugu Movies Box Office: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అనంతరం తెలుగు బాక్సాఫీస్ (Box Office) వద్ద ప్రస్తుతం వరుస సినిమాల హడావుడి కొనసాగుతోంది. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిబంధనల మేరకు సినిమాలను ప్రదర్శిస్తునప్పటికీ.. సినిమాల రిలీజ్ విషయంలో మాత్రం పోటీ అసలు తగ్గడం లేదు. మరి ఈ నెల చివరి వారంలో కూడా థియేటర్‌ ల్లో సందడి చేయబోతున్న సినిమాల పరిస్థితి ఏమిటో చూద్దాం.

ముందుగా ఈ వారం సినిమాల్లో కాస్త అంచనాలు ఉన్న సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ (Sridevi Soda Centre). సుధీర్‌ బాబు‌ హీరోగా కరుణకుమార్‌ దర్శకత్వంలో వస్తోంది ఈ సినిమా. ఇది పక్కా మాస్‌ లవ్‌ స్టోరీ అని టాక్. కాకపోతే, సుధీర్ బాబు పై మాస్ అంశాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. పైగా గ్రామీణ నేపథ్యంలో సాగనుంది ఈ సినిమా.

దీనికితోడు రెగ్యులర్ ఎలిమెంట్స్ ప్రేమ, కుటుంబ కథాంశాలతోనే ఈ సినిమా తెరకెక్కింది కాబట్టి, హిట్ అయ్యే దాకా నమ్మకం లేదు. ఆగస్టు 27న ఈ సినిమా భవిష్యత్తు తేలనుంది. ఇక మరో సినిమా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ‘నో పార్కింగ్‌’ అనేది శీర్షిక. సుశాంత్‌ హీరో కాబట్టి, ఓపెనింగ్స్ రావు. సినిమాకి హిట్ టాక్ వస్తోంది అనే నమ్మకం కూడా ఈ సినిమా పై లేదు. ఇది కూడా ఆగస్టు 27నే రిలీజ్ అవుతుంది.

అన్నట్టు అదే రోజు రిలీజ్ అవుతున్న మరో చిన్న సినిమా ‘హౌజ్‌ అరెస్ట్‌’. పేరులోనే తెలుస్తోంది, సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో.. శ్రీనివాస్‌ రెడ్డి, సప్తగిరి, రవిబాబు, రఘు, తాగుబోతు రమేశ్‌ కలిసి నటించిన సినిమా కాబట్టి.. కామెడీ ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ సినిమాలో కామెడీ మాత్రం లేదు అనేది ఫిల్మ్ జనాల నుండి అందుతున్న అప్ డేట్.

మొత్తమ్మీద ఈ వారం సినిమాల్లో నమ్మకంగా హిట్ అవుతుంది అనుకునే సినిమా ఒక్కటి కూడా లేదు. కాబట్టి.. ‘రాజ రాజ చోర’కు మరో వారం ఇక తిరుగులేదు.