https://oktelugu.com/

Analysis on Asians in America: అమెరికాలోని ఆసియా వాసులపై ఆసక్తికర విశ్లేషణ

అమెరికాలోని ఆసియా వాసులపై అక్కడి మీడియా ఆసక్తికర సర్వేను చేసింది. అమెరికా దేశ జనాభా గణనను ఆధారంగా చేసుకొని ఈ పరిశీలన చేసింది. అమెరికా జనాభాలో దాదాపు 6శాతం ఆసియన్లు అంటే దాదాపు 2 కోట్ల మంది వరకూ ఉన్నట్టు తెలిపింది. 2060 కల్లా వీరందరూ 4.60 కోట్ల మందికి చేరుతారని పేర్కొంది. అమెరికాలోని 176 కౌంటీల్లో 5శాతం మంది ఏసియన్లు ప్రబలంగా ఉన్నారు. కొన్ని దేశాలకు చెందిన వారైతే 10 లక్షలకుపైగా జనాభా అమెరికాలో ఉంటున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : August 23, 2021 / 12:38 PM IST
    Follow us on

    అమెరికాలోని ఆసియా వాసులపై అక్కడి మీడియా ఆసక్తికర సర్వేను చేసింది. అమెరికా దేశ జనాభా గణనను ఆధారంగా చేసుకొని ఈ పరిశీలన చేసింది. అమెరికా జనాభాలో దాదాపు 6శాతం ఆసియన్లు అంటే దాదాపు 2 కోట్ల మంది వరకూ ఉన్నట్టు తెలిపింది. 2060 కల్లా వీరందరూ 4.60 కోట్ల మందికి చేరుతారని పేర్కొంది. అమెరికాలోని 176 కౌంటీల్లో 5శాతం మంది ఏసియన్లు ప్రబలంగా ఉన్నారు.

    కొన్ని దేశాలకు చెందిన వారైతే 10 లక్షలకుపైగా జనాభా అమెరికాలో ఉంటున్నారు. ముందుగా  41 లక్షల మంది చైనీయులు అమెరికాలో అత్యధిక స్థాయిలో నివసిస్తున్నారు. ఇక రెండో స్థానంలో భారతీయులు 40 లక్షల మంది అమెరికాలో జీవిస్తున్నారు. మన కంటే చైనీయులు 1 లక్ష మంది మాత్రమే ఎక్కువగా ఉన్నారు. ఫిలిప్పీన్స్ వాసులు 29 లక్షల మంది ఉన్నారు. తర్వాత వియత్నం, కొరియన్స్ ఉన్నారు.ఇందులో 60శాతం మంది అమెరికాలో పుట్టిన వారు కాకపోవడం కావడం గమనార్హం. బయట దేశాల్లో పుట్టి చదువుకొని అమెరికా వచ్చిన వారే ఎక్కువ. ఆ దేశ మూలాలు కాని వారంతా వీరు అమెరికాలో నివసిస్తున్నారు.

    అమెరికాలో ఉంటున్న ఆసియా వాసుల్లో వ్యక్తిగత ఆదాయం, పేదరికంలో ఉన్న వారు, సొంత ఇల్లు ఉన్న వారు, కాలేజీ డిగ్రీ ఉన్న వారిని విభజించి అమెరికా ప్రభుత్వం జనాభా గణన చేసింది. ఈ క్రమంలోనే ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. అమెరికాలోని ఆసియా వాసులపై స్పెషల్ ఫోకస్ వీడియో..