Box Office: సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా ? ఇది అఖండ సినిమా రిలీజ్ కి ముందువరకు ఉన్న అనుమానం. నిజానికి అఖండ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ బయ్యర్లు కూడా ఈ విషయంలో చాలా టెన్షన్ పడ్డారు. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అఖండ రిలీజ్ అయి అఖండ విజయం సాధించి.. నిజంగానే సినిమా పరిశ్రమకి ఊపిరి పోసిందనే చెప్పాలి.
ఆ ఊపిరితో ఇప్పుడు విడుదలకి చాలా సినిమాలు సిద్దంగా ఉన్నాయి. దాంతో ఈ డిసెంబరు అంతా కొత్త సినిమాలతో తెలుగు చిత్రసీమ కళకళలాడిపోబోతుంది. కానీ అఖండ ఇచ్చిన బూస్టప్.. చిన్న సినిమాలకు ఎంతవరకు పనికొస్తోంది అనేదే డౌట్. ఎలాగూ డిసెంబరు 17న పుష్ఫ రాబోతుంది. ఆ తరవాత వారం నాని హీరోగా వస్తోన్న శ్యాం సింగరాయ్ సినిమా ఉంది.
ఆ వెంటనే సంక్రాంతి సీజన్ మొదలవుతుంది. ఇక భారీ చిత్రాలు పోటీ పడతాయి. కాబట్టి డిసెంబర్ 17వ తేదీ తర్వాత ఇక చిన్న సినిమాల రిలీజ్ కి డేట్ లేదు. కాబట్టి… ఈ సెకెండ్ వీకే మంచి అవకాశం. అందుకే ఈ వారం ఏకంగా 8 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. పేరుకి 8 సినిమాలు రిలీజ్ అవుతున్నా.. తెలిసిన సినిమాలు మాత్రం లక్ష్య, గమనం మాత్రమే.
నాగశౌర్య హీరోగా రాబోతున్న లక్ష్య సినిమా పై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. పైగా ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామాతో ఉంటుంది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉన్నా.. వ్యూస్ ను మాత్రం తెచ్చుకోలేకపోయాయి. అయితే, నాగశౌర్య మాత్రం ఈ సినిమా కోసం 8 ప్యాక్ బాడీ పెంచాడు. మాస్ ని తన వైపుకు లాగేసుకోవాడనికి బాగా కష్టపడ్డాడు.
కానీ, ఈ సినిమా చూసి శౌర్య ఇమేజ్ మారుతుందని అనుకోలేం. అయినా ఒక హీరోకి పైగా చిన్న హీరోకి మాస్ టచ్ రావాలి అంటే.. భారీ హిట్ ఉండాలి. శౌర్య కెరీర్ లో ఆ రేంజ్ హిట్ ఇంతవరకు పడలేదు. కాబట్టి, ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం లేదు. ఇక శ్రియ ప్రధాన పాత్రలో వస్తోన్న గమనం సినిమా పై మాత్రం క్లాస్ ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.
Also Read: ‘పుష్ప’ షూట్ లో యూనిట్ కు సంచలన ఆదేశాలు ఇచ్చిన అల్లు అర్జున్.. వీడియో వైరల్
పైగా ఈ సినిమాకి మంచి సాంకేతిక వర్గం పని చేసింది. ఇక ఈ వారం వచ్చే మిగిలిన సినిమాల విషయానికి వస్తే.. మడ్డీ, నయీం డైరీస్,చ బుల్లెట్ సత్యం, కటారి కృష్ణ, మనవూరి పాండవులు, ప్రియతమా చిత్రాలు రాబోతున్నాయి. వీటి భవిష్యత్తు గురించి కొత్తగా చెప్పేది ఏమి లేదు.
Also Read: నాగశౌర్య “లక్ష్య” సినిమా ట్రైలర్ రిలీజ్… ఈసారి సక్సెస్ ఏ గురి