Bigg Boss 7 Telugu: ఆ ఇద్దరికీ హౌస్లో ఉండే అర్హత లేదు, అతడి వల్లే ఎలిమినేట్ అయ్యా… పూజ సంచలనం!

నా డెసిషన్ రాంగ్ కానీ నేను ఆడలేను అని తీసుకోలేదు ఆ నిర్ణయం అంటూ పూజ చెప్పుకొచ్చింది. అయినా మీరు ఆడలేదు కదా అని గీతూ కౌంటర్ ఇచ్చింది. అక్కడున్న వారందరూ ఆది మాత్రమే అక్కడున్నారని కూడా కాదు కదా అంది పూజ.

Written By: NARESH, Updated On : October 24, 2023 9:54 am

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఏడో వారం ఎలిమినేట్ అయ్యి వచ్చిన పూజ మూర్తిని గీతూ ఇంటర్వ్యూ చేసింది. గీతూ ప్రశ్నలకు షాకింగ్ సమాధానాలు ఇచ్చింది పూజ. మీకు రెండు నామినేషన్స్ పడ్డాయి .. వాటిలో తుప్పాస్ నామినేషన్ అని ఏది అనిపించింది గీతూ అడిగింది.దాంతో వీడు చెప్పింది తుప్పాస్ అంటూ తేజ ఫోటో చించేసింది పూజ. వైల్డ్ కార్డు ఎంట్రీ తో వచ్చిన మీరు చాలా వైల్డ్ గా ఆడతారు అని మేము అనుకున్నాం అని అడిగింది.

దానికి దెబ్బ తగులుతుంది ఆడపిల్లలంటే సైలెంట్ గా ఇంట్లో టీవీ చూసుకుంటూ కూర్చోవాలా .. ఇట్లాంటి దానికి రాకూడదు అంటూ ఘాటుగా బదులిచ్చింది పూజ. మిగిలిన వాళ్ళు మీకంటే హౌస్ లో ఉండటానికి అర్హులని అనుకుంటున్నారా అని గీతూ అంటే అశ్విని,భోలే అర్హులు కాదు అని పూజ చెప్పింది.రీజన్ చెప్పమని గీతూ అడిగింది. ఎవరో నిన్ను పై నుంచి కింద వరకు చూసి ఆ నువ్వు ఫిజికల్లీ స్ట్రాంగే నాకు తెలుసు అన్నప్పుడు ఎవరికైనా కాలిపోతుంది అని పూజ చెప్పింది.

నా డెసిషన్ రాంగ్ కానీ నేను ఆడలేను అని తీసుకోలేదు ఆ నిర్ణయం అంటూ పూజ చెప్పుకొచ్చింది. అయినా మీరు ఆడలేదు కదా అని గీతూ కౌంటర్ ఇచ్చింది. అక్కడున్న వారందరూ ఆది మాత్రమే అక్కడున్నారని కూడా కాదు కదా అంది పూజ. ఆ తర్వాత మీరు హౌస్ మేట్స్ తో కలిసి ఆడటానికి వచ్చారా లేక ఎంకరేజ్ చేయడానికి వచ్చారా అని గీతూ ప్రశ్నించింది. గైడ్ చేశాను కానీ అది కూడా గేమ్ లో భాగమే అని పూజ ఆన్సర్ ఇచ్చింది. దాంతో ప్లేయర్ విన్ అవుతాడు కోచ్ విన్ అవ్వడు అంటూ గీతూ డైలాగ్ వేసింది.

ఆదివారం పూజ ఎలిమినేట్ కాగా రతిక రోజ్ రీఎంట్రీ ఇచ్చింది. శుభశ్రీ, దామిని, రతిక రోజ్ లలో ఒకరికి ఛాన్స్ దక్కాల్సి ఉంది. హౌస్ మేట్స్ ఓటింగ్ తో రతిక రోజ్ కి అవకాశం దక్కించుకుంది. రతికరోజ్ కొంచెం తీరు మార్చింది. ఈ రెండు రోజులుగా ఆమె కామ్ అండ్ ట్రెడిషనల్ గా ఉంటుంది.