Prabhas Anushka Marriage: ప్రభాస్-అనుష్క పెళ్లి అందుకే ఆగిపోయింది… నేషనల్ మీడియా సంచలన కథనం

సాహూ చిత్ర ప్రమోషన్స్ లో ప్రభాస్ ని ఈ ప్రశ్న వేధించింది. అనుష్కతో మీరు రిలేషన్ లో ఉన్నారట. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నారట? వంటి ప్రశ్నలు విలేకరులు అడిగారు. ప్రభాస్ సున్నితంగా ఈ రూమర్స్ ని ఖండించారు.

Written By: NARESH, Updated On : October 24, 2023 9:49 am

Prabhas Anushka Marriage

Follow us on

Prabhas Anushka Marriage: ప్రభాస్ పెళ్లి ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. మొన్నటి వరకు సింగిల్ లైఫ్ బెస్ట్ అన్న రానా, శర్వానంద్, నితిన్ లాంటి హీరోలు కూడా చక్కగా పెళ్లిళ్లు చేసుకున్నారు. 44 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రభాస్ మాత్రం సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తున్నారు. కాగా ప్రభాస్ తో అనుష్క శెట్టి వివాహం ఖాయమని పలుమార్లు వాదనలు తెరపైకి వచ్చాయి. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట బాహుబలి 2 అనంతరం వివాహం చేసుకుంటారని బలంగా వినిపించింది.

సాహూ చిత్ర ప్రమోషన్స్ లో ప్రభాస్ ని ఈ ప్రశ్న వేధించింది. అనుష్కతో మీరు రిలేషన్ లో ఉన్నారట. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నారట? వంటి ప్రశ్నలు విలేకరులు అడిగారు. ప్రభాస్ సున్నితంగా ఈ రూమర్స్ ని ఖండించారు. అనుష్క నాకు ఫ్రెండ్ మాత్రమే. అంతకు మించి మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని అన్నారు. తాజాగా నేషనల్ మీడియా ప్రచురించిన కథనం సంచలనంగా మారింది.

టైమ్స్ నౌ కథనం ప్రకారం అనుష్క-ప్రభాస్ 10 ఏళ్లకు పైగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని భావించారు. అయితే వీరి జాతకాలు కుదరలేదు. జాతకాలు, దేవుడిని గట్టిగా నమ్మే ప్రభాస్ తల్లి ఈ పెళ్ళికి అంగీకరించలేదు. తల్లి మాట కాదనలేని ప్రభాస్ అనుష్కతో వివాహ ఆలోచన విరమించుకున్నాడట. అయితే అనుష్క, ప్రభాస్ మరొకరిని వివాహం చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోవాలని డిసైడ్ అయ్యారట.

వయసు పైబడుతున్న ప్రభాస్ వివాహం చేసుకోకపోవడానికి కారణం ఇదే అంటున్నారు. ప్రభాస్ తో అనుష్క బిల్లా సినిమాలో ఫస్ట్ టైం జతకట్టింది. అనంతరం మిర్చి సినిమాలో మరోసారి అలరించారు. మిర్చి సూపర్ హిట్ కొట్టింది. ఇక బాహుబలి, బాహుబలి 2 చిత్రాల కోసం ఐదేళ్లు కలిసి పనిచేశారు. అనుష్క అత్యధికంగా ప్రభాస్ తో నాలుగు సార్లు నటించింది.