https://oktelugu.com/

Bommarillu Bhaskar: త్వరలోనే ఓ మెగా హీరోతో మూవీకి రెడీ అవుతున్న … బొమ్మరిల్లు భాస్కర్

Bommarillu Bhaskar: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్… ఒక్క సినిమా ఇద్దరి జీవితలను మార్చేసిందంటే నిజమనే చెప్పాలి. వారిలో ముఖ్యంగా ఒకరు బొమ్మరిల్లు భాస్కర్ అయితే మరొకరు అక్కినేని అఖిల్. 2006 లో విడుదలైన బొమ్మరిల్లు చిత్రంతో దర్శకుడిగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ సాధించాడు భాస్కర్. తొలి సినిమా ఇచ్చిన విజయంతో మూవీ టైటిల్ నే పేరులో చేర్చుకుని ” బొమ్మరిల్లు భాస్కర్‌ ” గా కొనసాగుతున్నారు. ఆ తర్వాత భాస్కర్ దర్శకత్వం వహించిన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 26, 2021 / 10:13 AM IST
    Follow us on

    Bommarillu Bhaskar: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్… ఒక్క సినిమా ఇద్దరి జీవితలను మార్చేసిందంటే నిజమనే చెప్పాలి. వారిలో ముఖ్యంగా ఒకరు బొమ్మరిల్లు భాస్కర్ అయితే మరొకరు అక్కినేని అఖిల్. 2006 లో విడుదలైన బొమ్మరిల్లు చిత్రంతో దర్శకుడిగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ సాధించాడు భాస్కర్. తొలి సినిమా ఇచ్చిన విజయంతో మూవీ టైటిల్ నే పేరులో చేర్చుకుని ” బొమ్మరిల్లు భాస్కర్‌ ” గా కొనసాగుతున్నారు.

    ఆ తర్వాత భాస్కర్ దర్శకత్వం వహించిన ‘పరుగు’, ‘ఆరెంజ్‌’, ‘ఒంగోలు గిత్త’ సినిమాలు మ్యూజిక్‌ పరంగా మెప్పించినా… సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఆయనకు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. చివరగా 2016లో తమిళ్‌లో ‘బెంగళూరు నాట్కాల్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు భాస్కర్.

    ఐదేళ్ల తర్వాత టాలీవుడ్​లో “మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌” చిత్రంతో సూపర్ హిట్‌ సాధించాడు. అక్కినేని అఖిల్‌, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఈ విజయంతో మళ్ళీ భాస్కర్ కి వరుస ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుంది. ఈ తరుణం లోనే గీతాఆర్ట్స్ బ్యానర్‌లో ఓ భారీ బ‌డ్జెట్ సినిమాను తెర‌కెక్కించే అవకాశం వచ్చినట్లే ఇదివరకే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

    ఈ సినిమాలో ఓ మెగా హీరో నటించనున్నారని సమాచారం. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలానే ‘ఆహా’ ఓటిటి కోసం కూడా బొమ్మరిల్లు భాస్కర్ ఓ ప్రోజుక్ట్ చేయనున్నారని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.