https://oktelugu.com/

Prashanth Neel: ప్రశాంత్ నీల్ ఆ స్టార్ హీరోతో వరుసగా రెండు సినిమాలు చేస్తున్నాడా..?

ప్రశాంత్ నీల్ పేరు చెబితే భారీ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఒక డార్క్ మూడ్ ఉంటుంది...ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ 2 (శౌర్యంగ పర్వాన్ని) తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతో పాటుగా ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమాకు సంబంధించిన పనులను కూడా చూసుకుంటున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : July 24, 2024 / 04:03 PM IST

    Prashanth Neel

    Follow us on

    Prashanth Neel: కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా లో మంచి విజయాన్ని అందుకున్న ఏకైక దర్శకుడు ప్రశాంత్ నీల్… ప్రస్తుతం ఈయన వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇలాంటి క్రమంలోనే ఆయన మీద కొన్ని గాసిప్స్ అయితే వస్తున్నాయి. నిజానికి ఆయన ఇప్పుడు వరుస సినిమాలు చేస్తు స్టార్ హీరోలందరినీ తన గ్రిప్ లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన అజిత్ తో రెండు సినిమాలు చేయడానికి కమిట్ అయినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక అందులో ఒకటి సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైతే మరొకటి ఇండివిజువల్ స్టోరీ తో సినిమా చేస్తున్నాడని తమిళ్ మీడియా దీని మీద కొన్ని స్పెషల్ కథనాలను కూడా చిత్రీకరిస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో ప్రశాంత్ నీల్ అజిత్ తో రెండు సినిమాలు చేస్తున్నాడు అంటూ ప్రతి ఒక్కరు నోరెళ్ళ పెడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఈ విషయం మీద అఫిషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చల ప్రకారం ఈ వార్తలైతే బయటికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ 2 (శౌర్యంగ పర్వాన్ని) తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతో పాటుగా ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమాకు సంబంధించిన పనులను కూడా చూసుకుంటున్నాడు. ఇక కే జి ఎఫ్ 3 కి సంబంధించిన వర్క్ కూడా చేయాల్సి ఉంది. ఇక దాంతో పాటుగా రామ్ చరణ్ తో ఒక సినిమా చేయాలనుకుంటున్నాడు. మరి ఇలాంటి సమయం లో ఇంత బిజీ షెడ్యూల్లో ఆయన ఇప్పుడప్పుడే అజిత్ తో అయితే సినిమా చేసే అవకాశాలు లేవు.

    Also Read: ‘సరిపోదా శనివారం’ మూవీ ఎస్ జే సూర్య కి ఎంత వరకు హెల్ప్ అవుతుంది…

    మరి ఇలాంటి సందర్భంలో ఎందుకు ఇలాంటి న్యూస్ లు వస్తున్నాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం అన్ని భాషల్లో ఉన్న హీరోలను టచ్ లో ఉంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలందరూ బిజీగా ఉండడంవల్ల ఆయన అజిత్ తో ఏదైనా సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడా? లేదంటే ఇవి అన్ని ఫేక్ న్యూస్ లా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇక ఈ విషయం మీద అజిత్ గానీ, లేదంటే ప్రశాంత్ నీల్ కానీ స్పందిస్తే తప్ప అసలు విషయాలు ఏంటో తెలిసే అవకాశాలు అయితే లేవు.

    అసలు ఇప్పటికే సలార్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో అప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ 2 సినిమా ఎప్పుడు వస్తుంది. అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన మీద ప్రెషర్ పెడుతున్నారు. కానీ అది వర్కౌట్ కావడం లేదు. మరి ఇంత బిజీ షెడ్యూల్ ని పెట్టుకొని అజిత్ లాంటి ఒక స్టార్ హీరో తో సినిమా చేయాలంటే ప్రశాంత్ నీల్ కొంతవరకు సాహసం అనే చెప్పాలి.

    ఇక నార్మల్ స్టోరీ తో సినిమా చేసి అజిత్ తో హిట్టు కొట్టాలి అంటే కష్టం కాబట్టి ఒక మంచి ఎక్స్ ట్రా ఆర్డినరీ స్టోరీ తోనే ఆయనతో సినిమా చేయాలి. కాబట్టి ప్రశాంత్ నీల్ ఇప్పుడైతే ఆయనతో సినిమా చేసే అవకాశం అయితే లేనట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ప్రశాంత్ నీల్ ఎలాంటి ప్లాన్ వేశాడు. ఎందుకు ఈ న్యూస్ లు బయటకు వస్తున్నాయనేది తెలియాలంటే మరి కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే…

     

    Also Read:  సుకుమార్ కి ఇతర డైరెక్టర్లకు మధ్య ఆ ఒక్కటే తేడా..? అందుకే ఈయన ఇంటలిజెంట్ డైరెక్టర్ అయ్యాడు…