Driving Licens: డ్రైవింగ్ లైసెన్స్ పొందే ముందు ఏం చేయాలి? లెర్నింగ్ ఎగ్జామ్ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు?

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే సంబంధిత వాహనాలు నడిపి టెస్ట్ లో పాసవ్వాలి. ఉదాహరణకు ద్విచక్ర వాహన లైసెన్స్ పొందాలనుకునేవారికి ఆర్టీఏ అధికారులు నిర్వహించే టెస్ట్ డ్రైవ్ లో పాసవ్వాల్సి ఉంటుంది. అప్పుడే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు.

Written By: Chai Muchhata, Updated On : July 24, 2024 5:57 pm

Driving Licens

Follow us on

Driving Licens: కొన్ని అవసరాల కోసం దూరం ప్రయాణించాలంటే ఈరోజుల్లో వాహనం తప్పనిసరి. ఇది ద్విచక్ర వాహనం అయినా.. 4 చక్రాల వాహనం అయినా ఏదో ఒకటి ఇంట్లో లేకుంటే చాలా కష్టమయ్యే రోజులివి. అందుకే ప్రతీ కుటుంబం తమకు ఉన్న బడ్జెట్ కు అనుగుణంగా టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ ను తీసుకుంటూ ఉంటారు. ఈ రెండు వాహనాల్లో ఏదీ డ్రైవ్ చేసినా లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. రోడ్డు, రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రైవింగ్ లైసెన్స్ ను జారీ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. ముందుగా కొన్ని పరీక్షలు పాసవ్వాలి. అలా కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే జరిమానాలు విధిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతన చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ చట్టాల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపేవారికి రూ. 100 నుంచి రూ.2000 వరకు ఫైన్ పడొచ్చు. ఒకవేళ లైసెన్స్ లేని తమ పిల్లలకు బైక్ ఇస్తే తల్లిదండ్రులకు రూ.25,000 జరిమానా విధిస్తారు. అంతేకాకుండా మైనర్ ద్విచక్ర వాహనాన్ని నడిపితే వాహన రిజిస్ట్రేషన్ ను కూడా రద్దు చేస్తారు. అందువల్ బైక్ లేదా కారు నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అయితే పూర్తి డ్రైవింగ్ లైసెన్స్ పొందే ముందు లెర్నింగ్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. దీని కాలపరిమితి పూర్తయిన తరువాతనే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. మరి దీనిని ఎలా పొందాలి? ఎవరు దీనిని ఇస్తారు?

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే సంబంధిత వాహనాలు నడిపి టెస్ట్ లో పాసవ్వాలి. ఉదాహరణకు ద్విచక్ర వాహన లైసెన్స్ పొందాలనుకునేవారికి ఆర్టీఏ అధికారులు నిర్వహించే టెస్ట్ డ్రైవ్ లో పాసవ్వాల్సి ఉంటుంది. అప్పుడే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. అయితే ఇది రావాలంటే ముందుగా లెర్నింగ్ పరీక్ష పాసవ్వాలి. ఈ పరీక్షకు 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి పదో తరగతి పాసై ఉండాలి. ఈ లెర్నింగ్ పరీక్ష ఎలా నిర్వహిస్తారంటే?

లెర్నింగ్ కోసం ఒకప్పుడ మాన్యువల్ గా దరఖాస్తు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తరువాత అధికారులు అర్హతలు పరిశీలిస్తారు. ఆ తరువాత ఓ రోజు ఎగ్జామ్ తేదీని ఇస్తారు. ఈరోజు రోడ్డు ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ ( ఆర్టీఏ) కార్యాలయానికి వెళ్లి ఆన్ లైన్ లో ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ట్రాఫిక్ కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. రోడ్డుపై వెళ్లే టప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? వాహనం నడిపే టప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లాంటి ప్రశ్నలు ఉంటాయి. ఇందుకోసం ముందుగానే ట్రాఫిక్ నియమాలు తెలుసుకొని ఉండాలి. ఈ పరీక్ష రిజల్ట్ పరీక్ష పూర్తయిన తరువాత వెంటనే తెలుస్తుంది. దీంతో మీరు లెర్నింగ్ పాసయ్యారా? లేదా? అనేది అప్పుడే తెలుసుకోవచ్చు.

లెర్నింగ్ పాయితే ఆర్టీఏ ఆఫీసు నుంచి ఓ సెర్టిఫికెట్ ఇస్తారు. ఇది తాత్కాలిక లైసెన్స్ అన్నమాట. దీంతో టూ వీలర్ వాహనం నడుపొచ్చు. అయితే కారు నడిపేవారు మాత్రం ఎల్ అనే స్టిక్కర్ అంటించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో నిర్ణీత వేగంలో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. ఆరు నెలలు పూర్తయిన తరువాత మాన్యువల్ గా బైక్ టెస్ట్ చేస్తారు. ఆ తరువాత పూర్తి లైసెన్స్ ను ఇస్తారు. పూర్తి లైసెన్స్ వచ్చిన తరువాత కూడా మద్యం తాగి నడపకుండా ఉండాలి. లేకుంటే మూడు సార్లు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే ఈ లైసెన్స్ ను రద్దు చేస్తారు.