Munjya: బాలీవుడ్ కి ఊపిరి పోసిన చిన్న సినిమా…

ప్రస్తుతం అన్ని భాషల్లోనూ చిన్న సినిమాల హవా కొనసాగుతుంది. ఆయా భాషల్లో రిలీజ్ అయిన సినిమాలు భారీ వసూళ్లను రాబడుతూ ఆకట్టుకుంటూ మంచి విజయాలను అందుకుంటున్నాయి.

Written By: Gopi, Updated On : July 3, 2024 11:10 am

Munjya

Follow us on

Munjya: ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోల హవా తగ్గిపోయింది. ఇక బాలీవుడ్ హీరోలు ఎవరు సినిమాలు చేసినా కూడా ఆ సినిమాలు పెద్దగా ఆడటం లేదు. ఒకప్పుడు అక్షయ్ కుమార్ సినిమాలు మంచి విజయాలను అందుకుంటు ఉండేవి. కానీ ఇప్పుడు ఏ హీరో సినిమా కూడా వాళ్ళు ఆశించిన మేరకు విజయాలను అందుకోవడం లేదు. ఇక ఇలాంటి సమయంలో బాలీవుడ్ ని సేవ్ చేసే స్టార్ హీరోలు ఎవరు లేరు అనే ఒక పేరైతే వచ్చింది.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అన్ని భాషల్లోనూ చిన్న సినిమాల హవా కొనసాగుతుంది. ఆయా భాషల్లో రిలీజ్ అయిన సినిమాలు భారీ వసూళ్లను రాబడుతూ ఆకట్టుకుంటూ మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన ‘ముంజ్యా’ అనే సినిమా ఇప్పుడు చిన్న సినిమాగా వచ్చి 100 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి సూపర్ సక్సెస్ సాధించింది. అయితే ఈ సినిమా ట్రైలర్ కి ముందు ఎవరికి కూడా పెద్దగా అంచనాలైతే లేవు. కానీ ఒక్కసారి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలు భారీగా పెరిగిపోయాయి. హార్రర్ సినిమాగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక పెద్ద సక్సెస్ సాధించిందనే చెప్పాలి…ఇప్పుడున్న పరిస్థితి ల్లో ఈ సినిమా బాలీవుడ్ కి ఊపిరి పోసిందనే చెప్పాలి…

ఆదిత్య సర్పొత్తర్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సూపర్ సక్సెస్ సాధించింది. ఇక ఈ సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ ని చూపించడంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు. బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా సాధించని సక్సెస్ ని ఈ సినిమా సాధించిందనే చెప్పాలి. జూన్ 7వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. దానివల్ల మొదటిరోజు నాలుగు కోట్ల 21 లక్షల వసూళ్లను సాధించింది.

ఇక రెండో రోజు 7 కోట్ల 40 లక్షల రూపాయలను రాబట్టింది. ఇలా డే బై డే కలక్షన్స్ ను పెంచుకుంటూ వెళ్ళిన ‘ముంజ్యా ‘ సినిమా 25 రోజుల్లోనే 100 కోట్లు మార్కును దాటింది. ఇక రీసెంట్ గా కల్కి సినిమా రిలీజ్ అవ్వడంతో ఈ సినిమా కలెక్షన్స్ చాలావరకు తగ్గాయి. ఇక మొత్తానికైతే చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించిన ఈ సినిమా తొందర్లోనే ఓటీటీ లో కూడా రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది…