Team India : టీమిండియా జింబాబ్వే టూర్.. శివం దూబే, సంజు సాంసన్, రింకూ, యశస్వి జైస్వాల్ ఔట్.. వీరికి చోటు

Team India : జింబాబ్వే టూర్ కు బీసీసీఐ యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, శివం దూబే, ఖలీల్ అహ్మద్, రింకు సింగ్ ను ఎంపిక చేసింది. అయితే ప్రస్తుతం వారిని తప్పించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Written By: NARESH, Updated On : July 3, 2024 10:59 am

Team India Zimbabwe Tour

Follow us on

Team India : టి20 వరల్డ్ కప్ గెలిచిన ఉత్సాహంలో టీమిండియా ఉంది. బార్బడోస్ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంకా టీమిండియా ఆటగాళ్లు స్వదేశానికి చేరుకోలేదు. బుధవారం సాయంత్రం రోహిత్ సేన స్వదేశానికి వచ్చే అవకాశం ఉంది. అయితే జూలై 6 నుంచి టీమిండియా జింబాబ్వే లో పర్యటించనుంది. ఇందులో భాగంగా 5 t20 ల మ్యాచ్ సిరీస్ ఆడుతుంది.. భవిష్యత్తు ఆశా కిరణాలను సిద్ధం చేయాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చింది. టి20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టి20 క్రికెట్ కు వీడ్కోలు పలికారు.

అంతకుముందే జింబాబ్వే టూర్ కు జట్టును ఎంపిక చేసిన నేపథ్యంలో.. రోహిత్, విరాట్, రవీంద్ర జడేజా లేని లోటు టీమిండియా పై పెద్దగా ఉండకపోవచ్చు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగే టి20 టోర్నీలో రోహిత్, కోహ్లీ, రవీంద్ర జడేజా స్థానాలను బీసీసీఐ ఎవరితో భర్తీ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. శ్రీలంక టూర్ లోనే టీమ్ ఇండియాలోకి కొత్త కోచ్ వస్తారని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. అయితే కోచ్ గా గౌతమ్ గంభీర్ రావడం ఖాయమని తెలుస్తోంది. జింబాబ్వేలో పర్యటించే భారత యువజట్టుకు శుభ్ మన్ గిల్ నాయకత్వం వహిస్తాడు. హరారే లోనే అన్ని మ్యాచ్ లు నిర్వహిస్తారు. షెడ్యూల్ ప్రకారం శనివారం తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఆదివారం రెండవ టి20 మ్యాచ్ నిర్వహిస్తారు. జూలై 10, 13, 14వ తేదీలలో చివరి 3 t20 మ్యాచ్ లు రెండు జట్లు ఆడతాయి..

జింబాబ్వే టూర్ కు బీసీసీఐ యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, శివం దూబే, ఖలీల్ అహ్మద్, రింకు సింగ్ ను ఎంపిక చేసింది. అయితే ప్రస్తుతం వారిని తప్పించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ ఐదుగురు ఆటగాళ్లు వెస్టిండీస్ లో ఉన్నారు.. శివం దూబే, సంజు సాంసన్, యశస్వి జైస్వాల్ ప్రస్తుతం ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో ఉన్నారు. రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ రిజర్వ్ ఆటగాళ్ళుగా ఉన్నారు. వీలు కూడా టీమిండియా తోనే ఉన్నారు. ప్రస్తుతం వెస్టిండీస్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాఫ్రికా – భారత్ మధ్య టి20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన బార్బడోస్, సెయింట్ లూసియా, గ్రెనడా, సెయింట్ విన్సెంట్ లో హరికేన్ తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో జింబాబ్వే టూర్ కు ఎంపికైన ఆటగాళ్లు మొత్తం టీమ్ ఇండియాతో ఉన్నారు. వారు స్వదేశానికి వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు తీరికలేని ప్రయాణాలతో ఆటగాళ్లు అలసిపోతారని బీసీసీఐ ఇప్పటికే ఒక అంచనాకొచ్చింది. అందువల్లే జైస్వాల్, శాంసన్, శివమ్ దూబే, ఖలీల్, రింకూ సింగ్ ను జింబాబ్వే పర్యటన నుంచి పక్కకు తప్పించింది. కొత్తగా వీరి స్థానంలో హర్షిత్ రానా, సాయి సుదర్శన్, జితేష్ శర్మలను వారి స్థానంలో   అవకాశం  కల్పించింది.

జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత ఆటగాళ్లు వీరే..

గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు, జురెల్, శివం దూబే, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్ పాండే.

కొత్తగా వీరు : హర్షిత్ రానా, సాయి సుదర్శన్, జితేష్ శర్మ