Geeta Tati: రోడ్డు పక్కన ఇడ్లీ బండి నడుపుకుంటున్న భగవంత్ కేసరి మూవీ నటి.. ఆమె జీవితం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

గీత అనే మహిళ నల్గొండ జిల్లా నకరికల్ పట్టణంలో రోడ్డు పక్కన ఇడ్లీ బండి నడుపుతుంది. ఆమెకు నటన పట్ల మక్కువ ఉంది. బాల్యంలో ఓ థియేటర్ పక్కనే వారి పేరెంట్స్ టిఫిన్ సెంటర్ నడిపేవారట.

Written By: S Reddy, Updated On : July 3, 2024 11:24 am

Geeta Tati

Follow us on

Geeta Tati: సినిమా అనే రంగుల ప్రపంచం లక్షల మందిని ఆకర్షిస్తుంది. నటులుగా, దర్శకులుగా, రచయితలుగా.. ఇతర సాంకేతిక రంగాల్లో రంగాల్లో రాణించాలి వేల మంది చిత్ర పరిశ్రమకు వెళతారు. వారిలో సక్సెస్ అయ్యేది కొందరే. సినిమా రంగంలో ఒక స్థాయికి వెళ్లాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. కాగా ఓ మహిళ కుటుంబ పోషణ కోసం రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ నడుపుతూనే, నటిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే పలు సీరియల్స్, సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోలలో ఆమె నటించారు.

గీత అనే మహిళ నల్గొండ జిల్లా నకరికల్ పట్టణంలో రోడ్డు పక్కన ఇడ్లీ బండి నడుపుతుంది. ఆమెకు నటన పట్ల మక్కువ ఉంది. బాల్యంలో ఓ థియేటర్ పక్కనే వారి పేరెంట్స్ టిఫిన్ సెంటర్ నడిపేవారట. ఆ సినిమా థియేటర్స్ నుండి వినపడే సౌండ్స్, సాంగ్స్, డైలాగ్స్ విని నటి కావాలని, సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలని గీత అనుకున్నారట. పెళ్ళై ఒక బిడ్డ పుట్టాక గీత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిందట.

గృహప్రవేశం, గుప్పెడంత మనసు, నిన్నే పెళ్లాడతా, నాలుగు స్తంభాలాట, రాధమ్మ కూతురు సీరియల్స్ లో గీత నటించింది. చిన్న చిన్న ఛానల్స్ లో యాంకర్ గా కూడా గీత చేయడం విశేషం. అలాగే పలు చిత్రాలు వెబ్ సిరీస్లలో ఆమె నటించారు. మహేష్ బాబు మహర్షి, బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రాల్లో గీత నటించింది.అయితే ఆమె పాత్రకు ఎలాంటి డైలాగ్స్ ఉండవు. ప్రేమ విమానంలా లగ్గం, ట్రెండింగ్ లవ్ స్టోరీ చిత్రాల్లో మదర్ రోల్స్ చేశారట. నెక్స్ట్ ఆమె గేమ్ ఛేంజర్ మూవీ ఆమె ఓ చిన్న పాత్ర చేశారట.

తాను ప్రత్యేకంగా నటన నేర్చుకోలేదట. డబ్స్మాష్, టిక్ టాక్, రీల్స్ చేస్తూ నటనలో ప్రావీణ్యత పొందిందట. టిఫిన్ కొట్టు నడుపుకునే ఈమెకు యాక్టింగ్ కెరీర్ అవసరమా అని చాలా మంది ఎగతాళి చేస్తుంటారట. కానీ ఆ నెగిటివ్ కామెంట్స్ ఆమె పట్టించుకోరట. తనకు ఇష్టమైన పని చేస్తూ ముందుకు సాగుతున్నాని ఆమె అన్నారు. పలువురికి నేను స్ఫూర్తిగా నిలుస్తున్నానని గీత తెలిపారు. సెల్ ఫోన్ ముందు నటించి, ఆ వీడియోలతో ప్రయత్నాలు చేయండి. అప్పుడు అవకాశాలు వస్తాయని గీత తన లాంటి ఔత్సాహికులకు సలహా ఇస్తుంది..