NTR: బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న నటులు చాలామంది ఉన్నారు. అయితే ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన వాళ్లు పాన్ ఇండియాలో తమ సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోతో జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 అనే సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి 1200 కోట్ల కు పైన భారీ కలెక్షన్లను కొల్లగొట్టారు. ఇక ఇప్పుడు రాబోయే సినిమాలతో కూడా ఇదే రేంజ్ లో కలెక్షన్లను వసూలు చేసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ప్రతో ఒక్క హీరో కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఎన్టీఆర్ ఇటు దేవర సినిమా చేస్తూనే, అటు వార్ 2 సినిమాలో బిజీగా మారిపోయాడు.
ఇక వార్ 2 సినిమాతో ఇండియా వైడ్ గా తన మేనియా ఏంటో చూపించాలని జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే తను ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ లుక్కుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి హృతిక్ రోషన్ ను డామినేట్ చేసి ఎన్టీఆర్ మంచి పేరు తెచ్చుకుంటాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. ఇక ఆ పాత్రని తను ఇప్పటివరకు ఎప్పుడు పోషించలేదు.
కాబట్టి ఇందులో వైవిధ్యమైన నటన కనబరిచి ఎలాగైనా సరే పాన్ ఇండియాలో ఈ సినిమాను సక్సెస్ చేసి తన మార్కెట్ ను అంతకంతకు పెంచుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరికి పాన్ ఇండియా మార్కెట్ అయితే ఉంది. ఇక వాళ్లలో ఎన్టీఆర్ ఒక్కడే కొద్ది వరకు వెనక బడ్డాడనే చెప్పాలి. అందుకే దేవర, వార్ 2 సినిమాలతో తన మార్కెట్ ను భారీ రేంజ్ లో పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నాడు..