Janhvi Kapoor: నెలసరి వచ్చిన ప్రతిసారి బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్… ఈయనే నా లవర్ అంటూ షాక్ ఇచ్చిన జాన్వీ కపూర్!

యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఎట్టకేలకు ఓపెన్ అయ్యింది. తన లవ్ స్టోరీ బయటపెట్టింది. శిఖర్ పహారియాతో తనకు గతంలో బ్రేకప్ అయ్యిందట. జాన్వీ కపూర్ కి నెలసరి వచ్చిన ప్రతిసారి ప్రియుడితో గొడవలు జరిగేవట. ఒకసారి శిఖర్ పహారియా వలన తన గుండె బద్దలైందట.

Written By: S Reddy, Updated On : July 23, 2024 8:51 am

Janhvi Kapoor

Follow us on

Janhvi Kapoor: యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఎట్టకేలకు ఓపెన్ అయ్యింది. తన లవ్ స్టోరీ బయటపెట్టింది. శిఖర్ పహారియాతో తనకు గతంలో బ్రేకప్ అయ్యిందట. జాన్వీ కపూర్ కి నెలసరి వచ్చిన ప్రతిసారి ప్రియుడితో గొడవలు జరిగేవట. ఒకసారి శిఖర్ పహారియా వలన తన గుండె బద్దలైందట.

లెజెండరీ నటి శ్రీదేవి వారసురాలిగా పరిశ్రమలో అడుగు పెట్టింది జాన్వీ కపూర్. శ్రీదేవి కూతురన్న ఇమేజ్ ఆటోమేటిక్ గా జాన్వీ కపూర్ కి పాపులారిటీ తెచ్చింది. 2018లో జాన్వీ కపూర్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. దఢక్ ఆమె డెబ్యూ మూవీ. ఇషాన్ కట్టర్ హీరోగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ పర్లేదు అనిపించుకుంది. అయితే సిల్వర్ స్క్రీన్ పై కూతురిని చూసుకోవాలన్న శ్రీదేవి కల నెరవేరకుండానే ఆమె కన్నుమూశారు.

జాన్వీ కపూర్ పరిశ్రమలో అడుగుపెట్టి ఆరేళ్ళు దాటింది. కానీ ఆమెకు చెప్పుకోదగ్గ హిట్స్ పడలేదు. కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేసింది. స్టార్ హీరోల పక్కన నటించే కమర్షియల్ హీరోయిన్ ఇమేజ్ ఆమెకు రాలేదు. చెప్పాలంటే బాలీవుడ్ లోని ఒక్క స్టార్ హీరో కూడా ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు. అనూహ్యంగా సౌత్ లో భారీ ఆఫర్స్ అందుకుంది.

తమిళనాడుకు చెందిన శ్రీదేవి సౌత్ లో తిరుగులేని నటిగా ఉండేది. బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా శ్రీదేవి సక్సెస్ అయ్యింది. కేవలం శ్రీదేవి కూతురన్న ఒక్క కారణంతో జాన్వీ కపూర్ కి దేవర, ఆర్సీ 16 చిత్రాల్లో ఆఫర్స్ వచ్చాయి. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ దేవర మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ దాదాపు పూర్తి చేసుకుంది. రెండు భాగాలుగా విడుదల కానున్న దేవర చిత్రానికి కొరటాల శివ దర్శకుడు.

అలాగే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఆర్సీ 16లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైంది. పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. దేవర, ఆర్సీ 16 చిత్రాలతో జాన్వీ కపూర్ ఫేట్ మారే సూచనలు కలవు. బాలీవుడ్ కి ధీటుగా ఎదిగిన సౌత్ లో సక్సెస్ అయితే జాన్వీ కపూర్ కెరీర్ కి ప్లస్ అవుతుంది.

ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ తన లవ్ ఎఫైర్ బహిర్గతం చేసింది. శిఖర్ పహారియాతో తన రిలేషన్ పై ఓపెన్ అయ్యింది. కాగా శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్ కి సినిమాల్లోకి రాక మునుపు నుండే పరిచయం ఉందట. ఒకసారి వారి బ్రేకప్ కాగా మరలా కలిశారట. తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న జాన్వీ కపూర్ కీలక కామెంట్స్ చేసింది.

నాకు పీరియడ్స్ మొదలైన రెండేళ్ల తర్వాత నుండి శిఖర్ తో గొడవలు జరిగేవి. నెలసరి వచ్చిన ప్రతిసారి బ్రేకప్ అయ్యేది. తర్వాత ఏడ్చుకుంటూ వెళ్లి నేనే సారీ చెప్పేదాన్ని. ఆ సమయంలో నా మైండ్ పని చేసింది కాదు. అలా ఎందుకు ప్రవర్తిస్తున్నానో నాకు అర్థం అయ్యేది కాదు. ఒకసారి శిఖర్ పహారియా చేసిన పనికి నా గుండె బద్దలు అయ్యింది. అయితే అతడే మరలా ఆ వేదన తొలగించాడు. ఇప్పుడు అంతా బాగుందని చెప్పుకొచ్చింది.

శిఖర్ పహారియాతో పాటు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో జాన్వీ కపూర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక ఇషాన్ కట్టర్, ఆర్యన్ కార్తీక్ తో పాటు మరికొందరితో జాన్వీ కపూర్ ఎఫైర్ నడిపారనే రూమర్స్ ఉన్నాయి.