Amir Khan
Amir Khan : దేశం గర్వించదగ్గ నటులలో ఒకరు అమీర్ ఖాన్(Amir Khan). ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించాడాయన. సినిమా కోసం ఆయన ప్రాణాలను కూడా పణంగా పెట్టేస్తాడు. సినిమా పూర్తి చేశామా, వెళ్ళిపోమయా అన్నట్టుగా ఉండే హీరోలు ఉన్న ఈ కాలం లో, పెద్ద సూపర్ స్టార్ స్థానంలో ఉంటూ కూడా తన సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి అమీర్ ఖాన్ చేసే ప్రొమోషన్స్ ఒక ట్రెండ్ సెట్టర్ లాంటివి అని చెప్పొచు. ఈ తరం హీరోలు అమీర్ ఖాన్ ని చూసి నేర్చుకోవలసినవి చాలానే ఉన్నాయి. అలాంటి లెజెండ్ మన ఇండియన్ సినిమాకి దొరకడం, మన ఇండియన్ సినిమా చేసుకున్న అదృష్టం అని చెప్పొచ్చు. కేవలం నటుడిగా మాత్రమే కాదు, దర్శకుడిగా, నిర్మాతగా కూడా అమీర్ ఖాన్ సక్సెస్ లను అందుకున్నాడు. అలాంటి అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితం మాత్రం అంత క్లీన్ గా లేదు.
1986 వ సంవత్సరం లో రీనా దుత్త(Reena Dutta) ని ప్రేమించి పెళ్లాడిన అమీర్ ఖాన్ 16 ఏళ్ళ తర్వాత విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఈ దంపతులిద్దరికీ జునైద్ ఖాన్ , ఇరా ఖాన్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు ఇరా ఖాన్(Aira Khan) కి ఇటీవలే పెళ్లి చేసిన అమీర్ ఖాన్, కొడుకు జునైద్ ఖాన్(junaid khan) ని హీరోగా ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. రీనా దుత్త తో విడాకులు తీసుకున్న తర్వాత, అమీర్ ఖాన్ తన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన కిరణ్ రావు(Kiran Rao) ని పెళ్లాడాడు. ఈమెతో కూడా రీసెంట్ గానే ఆయన విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. వీళ్ళిద్దరితో విడాకులు తీసుకున్నప్పటికీ అమీర్ ఖాన్ ఇంకా వాళ్ళతో స్నేహపూర్వకంగా వాతావరణంలోనే ఉన్నాడు. కిరణ్ రావు తో కలిసి ఆయన వరుసగా సినిమాలను కూడా నిర్మిస్తున్నాడు. ఇప్పుడు అమీర్ ఖాన్ కి 60 ఏళ్ళు వచ్చాయి.
ఈ 60 ఏళ్ళ వయస్సు లో ఆయన మూడవ పెళ్ళికి సిద్ధం అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ అమ్మాయి బెంగళూరు ప్రాంతానికి చెందినది అట. ఈమెని రీసెంట్ గానే అమీర్ ఖాన్ తన కుటుంబానికి కూడా పరిచయం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అమ్మాయి ఎవరు, ఏ పరిశ్రమకు చెందింది అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంచారు. అమీర్ ఖాన్ స్వయంగా ఈ మూడవ పెళ్లి విషయం గురించి అధికారికంగా త్వరలోనే ప్రకటన చేయబోతున్నాడని తెలుస్తుంది. మరి ఆయన ఆ ప్రకటన చేసిన తర్వాత అభిమానుల నుండి, ప్రేక్షకుల నుండి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి. ఇకపోతే అమీర్ ఖాన్ చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉన్నాడు. త్వరలోనే ఆయన లోకేష్ కనకరాజ్(Lokesh Kanakaraj) తో కలిసి ఒక చిత్రం చేయబోతున్నాడని టాక్. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.