Allu Arjun- Atlee Movie
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) సినిమా అంటే ఆడియన్స్ ఎన్నో కోరుకుంటారు. అందులో సాంగ్స్ కూడా ఒకటి. ఆయనకు ఉన్నటువంటి మ్యూజిక్ టేస్ట్ టాలీవుడ్ లో ఏ హీరోకి కూడా లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కెరీర్ లో దాదాపుగా అన్ని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆడియో ఉంది. ఈమధ్య కాలంలో ఆడియన్స్ కి ఒక సినిమా మీద పాజిటివ్ అభిప్రాయం కలగాలంటే కచ్చితంగా ఆడియో పెద్ద హిట్ అవ్వాలి. ఆడియో బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఉంటే సినిమాల ఫలితాలు ఏ రేంజ్ లో ఉంటున్నాయో మనం ఎన్నో ఉదాహరణలు చూస్తున్నాం. అల్లు అర్జున్ ఈ ట్రెండ్ ని ఒడిసిపట్టుకుని, తన సినిమాలో ఆడియో ని తన అభిరుచికి తగ్గట్టుగా మ్యూజిక్ డైరెక్టర్స్ తో చేయిస్తున్నాడు. ఆ సాంగ్స్ ప్రపంచవ్యాప్తంగా శ్రోతరులను ఎలా అలరించాయి మనమంతా చూసాము. అంతర్జాతీయ సెలెబ్రిటీలు కూడా ఆ పాటలకు డ్యాన్స్ వేశారు.
అలాంటి అల్లు అర్జున్ ఇప్పుడు తన కొత్త సినిమా కోసం ప్రయోగం చేయబోతున్నాడా..?, స్టార్ హీరోలందరూ అనిరుద్(Anirudh Ravichandran) వెంట పరుగులు తీస్తుంటే, అల్లు అర్జున్ అతన్ని కాదని కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చి రిస్క్ చేస్తున్నాడా అని సోషల్ మీడియా లో ఒక చర్చ నడుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్ త్వరలోనే పాన్ ఇండియన్ డైరెక్టర్ అట్లీ(atlee) తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడే మొదలయ్యే అవకాశాలు లేవు కానీ, త్రివిక్రమ్ సినిమా పూర్తయిన వెంటనే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ని పెట్టుకుందామని ముందుగా డైరెక్టర్ అట్లీ అనుకున్నాడట. కానీ అల్లు అర్జున్ అభయంకర్(Sai Abhayankar) ని ఎంచుకున్నట్టు లేటెస్ట్ గా ఫిలిం సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం. ఇతని వయస్సు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే.
టిప్పు, హరిణి అనే ప్రముఖ సింగర్స్ కుమారుడు ఇతను. ఇంతకు ముందు ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇతని టాలెంట్ ని ఎంతో నచ్చిన ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్, తన సినిమాటిక్ యూనివర్స్ లో రాఘవ లారెన్స్ హీరో గా నటిస్తున్న ‘బెంజ్’ అనే చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఇంకా చిత్రీకరణ దశలోనే ఉంది. కానీ ఇంతలోపే ఇండియాలోనే మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ గా పిలవబడే అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ కి సంగీతం అందించనున్నాడు. మ్యూజిక్ టేస్ట్ ఉన్నటువంటి అల్లు అర్జున్ ఒకరిని నమ్మి అవకాశం ఇచ్చాడంటే కచ్చితంగా అతను ఎంత టాలెంటెడ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం తర్వాత అభయంకర్ పేరు దేశవ్యాప్తంగా సెన్సేషన్ కాబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో అనిరుద్ లాంటి అద్భుతమైన టాలెంట్ ఉన్న సంగీత దర్సకుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.