Bollywood Stars On Mahesh Babu: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ హవా ఎక్కువగా కొనసాగుతోంది. మన దర్శకులు చేస్తున్న సినిమాలు భారీ ప్రభంజనాలను సృష్టిస్తూ ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక రాబోయే సినిమాలతో కూడా మన దర్శకులు పెను ప్రభంజనాలను సృష్టించడానికి కసరత్తులు చేస్తున్నారు…
రాజమౌళి (Rajamouli) బాహుబలి (Bahubali) సినిమా చేయడంతో పాన్ ఇండియా మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ప్రతి ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలన్నీ పాన్ ఇండియాలో రిలీజ్ అయి మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఇక కొన్ని సినిమాలు డిజాస్టర్లుగా కూడా మారుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే బాలీవుడ్ హీరోలకు తెలుగు సినిమా హీరోల నుంచి జరగాల్సిన నష్టమైతే జరుగుతోంది. మన హీరోలు చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అయి మంచి విజయాలను సాధిస్తూ ఉండడం వల్ల వాళ్ళ మార్కెట్ అనేది తగ్గిపోతుంది. ఇక దానికి తగ్గట్టుగానే మన హీరోలను బీట్ చేసే సినిమాలను వాళ్ళు చేయలేకపోతున్నారు. కారణం ఏదైనా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఖాన్ త్రయం తో పాటు ఇతర హీరోలకు కూడా కాలం చెల్లిపోయిందనే చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే అని చెప్పుకుంటూ వస్తున్న వాళ్ళకి తెలుగు సినిమా ఇండస్ట్రీ సరైన గుణపాఠం చెబుతుందనే చెప్పాలి… ఇక మొన్నటిదాకా ప్రభాస్ (Prabhas) ,రామ్ చరణ్(Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మాత్రమే పాన్ ఇండియాలో సినిమాలను చేస్తూ వచ్చారు.
కానీ ఇప్పుడు మహేష్ బాబు (Mahesh Babu) ఏకంగా పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. కాబట్టి పాన్ ఇండియా మార్కెట్ కూడా ఆటోమేటిగ్గా ఓపెన్ అవుతుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక మహేష్ బాబు కనుక బాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణించగలిగితే మాత్రం బాలీవుడ్ హీరోలు చేయాల్సిన ఆఫర్స్ అన్నింటినీ తనే దక్కించుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక బాలీవుడ్ మీడియా కూడా ఈ విషయం మీద పలు కథనాలను వెల్లడిస్తుంది. నిజానికి మహేష్ బాబు చూడడానికి హాలీవుడ్ హీరోలా ఉంటాడు. కాబట్టి బాలీవుడ్ సినిమాలను చేయడం పెద్ద విశేషం అయితే కాదు. ఇక బాలీవుడ్ హీరోలు అయిన రన్బీర్ కపూర్ , అమీర్ ఖాన్, షారుఖాన్ లాంటి హీరోలతో సినిమాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికి మహేష్ బాబు బెస్ట్ ఆప్షన్ గా కనబడతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
కాబట్టి ఇకమీదట ఇండస్ట్రీలో వచ్చే కొత్త కథలను కూడా మహేష్ బాబును ఉద్దేశించే రాసుకుంటారని మహేష్ బాబు అభిమానులు సైతం సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక ఇది తెలిసిన బాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయనను బీట్ చేసే సినిమాలు మేము చేస్తామంటూ వాళ్ళ సన్నిహిత వర్గాల దగ్గర తెలియజేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం టాప్ గేర్ లో దూసుకుపోతుందనే చెప్పాలి…