AP new eligible pensioners: ఎన్టీఆర్ భరోసా పథకం కింద భర్త మరణించిన భార్యకు ప్రభుత్వం పెంచిన అందజేస్తుంది. రాష్ట్రంలో ఈ పథకం కింద మొత్తం 71,380 మందికి నెల నెల రూ.4 వేలు చొప్పున ప్రభుత్వం పింఛన్ అందజేయనుంది. ఇప్పటికే అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం ఆ దరఖాస్తులలో కొన్ని తిరస్కరించిన వాటికి గల కారణాలను కూడా అధికారులు వివరించారు. అర్హులైన లబ్ధిదారుల ఖాతాలలో ఈ పింఛన్ డబ్బులు జమ చేయబడతాయి. స్పౌజ్ క్యాటగిరిలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులైన వారికి పింఛన్ పంపిణీ చేయనుంది. కొత్తగా 71,380 స్పౌజ్ పింఛన్లను ప్రభుత్వం ఈనెల 12న మంజూరు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12వ తేదీ నాటికి ఏడాది పాలనా పూర్తి అయిన సందర్భంగా ప్రభుత్వం స్పౌజ్ పింఛన్లు పంపిణీ చేయనుంది. దీనికోసం ఇప్పటికే బడ్జెట్లో రూ.29.60 కోట్లను రిలీజ్ చేసినట్లు సమాచారం.
అర్హులైన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది డబ్బులను అందజేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భర్త మరణించిన భార్యకు స్పౌజ్ క్యాటగిరిలో పింఛన్లను అందజేసే ప్రక్రియ మొదలు పెట్టింది. ఈ పథకం గత ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మే నెలకు సంబంధించిన పింఛన్ రూ.4000 రూపాయలను జూన్ 12వ తేదీన పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సామాజిక భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ పింఛన్ పథకం కింద స్పౌజ్ పింఛన్ పథకాన్ని తీసుకొని వచ్చింది. ఈ క్రమంలో భర్త చనిపోయిన భార్యకు ఈ పింఛన్ ప్రభుత్వం అందేలాగా ఏర్పాటు చేసింది. గత ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి ఇది అర్హులైన వారికి అందజేస్తున్నారు.
Also Read: Pensions: ఏపీలో రేపు ఆ 71 వేల మందికి పింఛన్లు!
ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 1, 2023 నుంచి అక్టోబర్ 31, 2024 వరకు స్వీకరించింది. ఇక ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71,380 అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. అర్హులైన వారందరికీ ఈనెల జూన్ 12న ప్రభుత్వ అధికారులు ఇళ్లకు వెళ్లి పింఛన్ పంపిణీ చేస్తారు. గ్రామ మరియు వార్డు సచివాలయాల ఖాతాలలో ఈ పింఛన్లు మొత్తం ఈరోజు జమ కానున్నాయి. ఇక గురువారం రోజున అర్హులైన వాళ్లందరికీ ఈ పింఛన్ పంపిణీ జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 71,380 మందికి ఒక్కొక్కరికి ₹4,000 చొప్పున పింఛన్ అందిస్తారు.