https://oktelugu.com/

ప్రభాస్ కి అక్కగా ఆల్ టైమ్ హోమ్లీ బ్యూటీ !

నేషనల్ స్టార్ అనగానే గుర్తుకువచ్చే హీరోల్లో ప్రభాస్ కూడా ఒకరు. అందుకే తన మార్కెట్ కి తగ్గట్లుగానే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను సెట్ చేసుకుంటూనే… ఆ సినిమాల్లో మిగిలిన కీలక నటీనటులను కూడా పాన్ ఇండియా స్టార్లునే పెట్టుకుంటూ.. మొత్తానికి నిజమైన పాన్ ఇండియా స్టార్ అనిపించుకుంటున్నాడు. అయితే ఆ మధ్య ప్రభాస్ ‘ఆదిపురుష్’లో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ నటించబోతుందనే రూమర్ ఒకటి సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేసింది. […]

Written By:
  • admin
  • , Updated On : November 12, 2020 / 07:34 PM IST
    Follow us on


    నేషనల్ స్టార్ అనగానే గుర్తుకువచ్చే హీరోల్లో ప్రభాస్ కూడా ఒకరు. అందుకే తన మార్కెట్ కి తగ్గట్లుగానే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను సెట్ చేసుకుంటూనే… ఆ సినిమాల్లో మిగిలిన కీలక నటీనటులను కూడా పాన్ ఇండియా స్టార్లునే పెట్టుకుంటూ.. మొత్తానికి నిజమైన పాన్ ఇండియా స్టార్ అనిపించుకుంటున్నాడు. అయితే ఆ మధ్య ప్రభాస్ ‘ఆదిపురుష్’లో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ నటించబోతుందనే రూమర్ ఒకటి సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేసింది. కానీ ఈ రూమర్ చివరకు రూమర్ గానే మిగిలిపోయింది. అయితే, ఇప్పుడు ఇదే పాత్రలో మరో మాజీ బ్యూటీ పేరు వినిపిస్తోంది.

    Also Read: సోనియా అగర్వాల్ ‘సినీ’ కష్టాలు.. గుండె తరుక్కుపోవాల్సిందే..!

    బాలీవుడ్ ఆల్ టైమ్ హోమ్లీ బ్యూటీ కాజోల్ ప్రభాస్ ‘ఆదిపురుష్’లో ప్రభాస్ కి అక్కగా నటిస్తోందట. వినడానికి డౌట్ గా ఉన్నా.. ఈ వార్త నిజమే అంటూ.. బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే. అయితే కాజోల్ గత కొంతకాలంగా రెగ్యులర్ సినిమాలకి దూరంగా ఉంటూ వస్తోంది. కానీ మధ్యలో కొన్ని సినిమాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పాత్ర వస్తే.. చేస్తోంది. అలా రఘువరన్ 2లో కూడా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో కాజోల్ కి పెద్దగా నేమ్ కూడా ఏమిరాలేదు. అయితే భారీ స్థాయీలో హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తీసిపోకుండా రూపొందించబోతున్న ఆదిపురుష్ లో ఈ అత్యంత కీలక పాత్రలో ఆమె అయితేనే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నారు.

    Also Read: బిగ్ బాస్ లోకి మరో హీరో ఎంట్రీ.. టీఆర్పీ కోసం కష్టపడుతున్న నాగ్?

    అందుకే ఆ పాత్రకు కాజోల్ అయితేనే న్యాయం జరుగుతుందని.. అందుకే ఆమెను ఆ పాత్రలో తీసుకుంటున్నారని తెలుస్తోంది. మరి ఈ రూమర్ నిజం అయితే ప్రభాస్ సినిమాకి మరింత ప్లస్ అవ్వనుంది. ద‌ర్శ‌కుడు సంజ‌య్ రౌత్ దర్శకత్వంలో రానున్న ఈ “ఏ- ఆది పురుష్” సినిమా దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవగణ్, అమితాబ్ లాంటి మహుమహులు నటిస్తారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా కూడా హిట్ అయితే ప్రభాస్ బాలీవుడ్ లో కూడా తిరుగులేని స్టార్ గా చలామణి అవ్వడం ఖాయం. మరి చూడాలి ఏమి జరుగుతుందో.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్