ఎంకి పెళ్లి సుబ్బి చావుకంటే ఇదే కాబోలు.. ఏపీ సీఎం జగన్ కు, ఓ సుప్రీంకోర్టు జడ్జికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఓ బ్యాంకు ఉద్యోగులు బలి అయిన విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: విశాఖ రాజధాని: కీలక విజయాన్ని సాధించిన సీఎం జగన్
తాజాగా ఏపీ ఏసీబీ ఉద్యోగులకు చట్టప్రకారం సమాచారం అందించిన పాపానికి ఓ బ్యాంకు ఉద్యోగులను బలిపశువులను చేసిన వైనాన్ని ఓ తెలుగు దినపత్రిక బయటపెట్టడం సంచలనంగా మారింది. సుప్రీం కోర్టు జడ్జి కుమార్తెల బ్యాంకు లావాదేవీల వివరాలను ఏసీబీ దర్యాప్తు సంస్థకు అందజేసినందుకు ఏపీలోని లీడ్ బ్యాంకు తమ ఉద్యోగులను పనిష్ మెంట్ కింద బదిలీ చేయడం సంచలనంతోపాటు వివాదాస్పదమైంది. బ్యాంకు రికార్డులు ఇచ్చారని ఓ బ్యాంకు ఉద్యోగులు ఐదు మందిని బదిలీ చేశారనే వార్త ఇప్పుడు దుమారం రేపుతోంది.
అమరావతి అక్రమాలపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ ఏసీబీకి సుప్రీం జడ్జి కూతుళ్ల బ్యాంకు లావాదేవీల రికార్డులను ఇచ్చారని బ్యాంకు ఉద్యోగులను ఆ బ్యాంకు యాజమాన్యం బదిలీ చేసింది. ఒకరకంగా ఇది బ్యాంకు అంతర్గత వ్యవహారమే.
Also Read: డిసెంబర్ 4న జీహెచ్ఎంసీ ఎన్నికలు?.. కేసీఆర్ ను బీజేపీ ఓడిస్తుందా?
ఏపీ ప్రభుత్వానికి చెందిన దర్యాప్తు సంస్థకు, పోలీసులకు.. బ్యాంకు ఉద్యోగులు సహకరించారని పైనుంచి ఒత్తిడి రావడం.. బదిలీ చేశారని ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడు అంతర్గత బదిలీల విషయంలో కూడా ఇప్పుడు బ్యాంకులు కొన్ని రూల్స్ పెట్టుకున్నాయని, కరోనా నేపథ్యంలో బదిలీల ప్రక్రియలను ఆపారని, అలాగే విజయవాడ రీజియన్ నుంచి బదిలీ అయిన ఐదు మందిలో ఒకరు రిటైర్మెంట్ కు మరో ఏడాది కాలమే ఉందని, ఇలాంటి సమయంలో సాధారణంగా బదిలీలు చేయడం ఏంటని బ్యాంకు ఉద్యోగులు వాపోతున్నారట.. అయినా ఈ బదిలీలు జరగడం ఢిల్లీ నుంచి వచ్చిన కొందరు పెద్దల ఒత్తిళ్ల ఫలితమే అని ప్రచారం సాగుతోంది. బ్యాంకు ఉద్యోగులను బలిపశువులను చేశారని తెలిసింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
సుప్రీం కోర్టు జడ్జి కూతుళ్ల అక్రమాలపై విచారణలో ఇలా బ్యాంకు అధికారులు అనూహ్యమైన బదిలీలకు గురికావడమే ఇప్పుడు సంచలనంగానే మారిందని సర్వత్రా చర్చ జరుగుతోంది.