Jagapathi Babu vs Bollywood Hero: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మ్యాన్లీ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న నటుడు జగపతి బాబు…ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలను చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన ఆయన ఆ తర్వాత కాలంలో హీరోగా తన మార్కెట్ ను కోల్పోవడంతో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు రకాల పాత్రలను పోషిస్తూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడు…అలాంటి జగపతి బాబు ఇప్పుడు ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ నటులలో తను కూడా ఒకడిగా మారిపోవడం విశేషం…ఇక జగపతిబాబు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘అంతఃపురం’ అనే సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో నటించాడు. ముఖ్యంగా ఆయన క్యారెక్టర్ లో ఉన్న ఆర్క్ ను చాలా బాగా ఎలివేట్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేశాడు. దాంతో ఆయన క్యారెక్టర్ కి చాలా మంచి ఇమేజ్ అయితే వచ్చింది. ఇక మొత్తానికైతే ఆయన ఆ సినిమాలో చనిపోయేటప్పుడు చెప్పే కొన్ని డైలాగులు సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవడమే కాకుండా జగపతిబాబు కెరియర్ లోనే ఇప్పటివరకు అలాంటి ఒక పాత్రను పోషించలేదు. అనేంతల తన పాత్రతో ప్రేక్షకులందరికీ గుర్తుండి పోయేలా నటించాడు… ఈ సినిమాని ఆ తర్వాత కృష్ణవంశీ బాలీవుడ్లో రీమేక్ చేశాడు.
‘శక్తి ది పవర్’ పేరుతో రీమేక్ అయిన ఈ సినిమాలో జగపతిబాబు పోషించిన పాత్రను షారుక్ ఖాన్ చేశాడు. షారుక్ ఖాన్ ఆ పాత్రలో ఏమాత్రం తన ఇంపాక్ట్ ను క్రియేట్ చేయలేకపోయారంటూ ఆ తర్వాత కొన్ని విమర్శలను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా జగపతిబాబు పాత్రతో పోలుస్తూ షారుక్ ఖాన్ ను చాలామంది డిగ్రేడ్ చేస్తూ మాట్లాడారు.
Also Read: ‘అగ్నిపరీక్ష’ ప్రోమో: ఈ కాళ్ళు లేని వ్యక్తి గురించి తెలిస్తే రోమాలు నిక్కపొడుచుకుంటాయి!
ఇక ఒకానొక సందర్భంలో షారుక్ ఖాన్ సైతం జగపతిబాబు పాత్రను చూసి బాగా చేశాడు అంటూ జగపతి బాబును ప్రశంసించిన సందర్భాలు కూడా ఉన్నాయట. మరి ఏది ఏమైనా కూడా అప్పట్లోనే జగపతి బాబు బాలీవుడ్ హీరోలకు తన నటనతో చుక్కలు చూపించాడనే చెప్పాలి.
జగపతిబాబు యాక్టింగ్ మ్యాచ్ చేయడం బాలీవుడ్ బాద్షాగా చెప్పుకునే షారుక్ ఖాన్ వల్ల కూడా కాలేదు అంటే అప్పట్లోనే మన నటుల స్టామినా ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు… ఇక ప్రస్తుతం పాన్ ఇండియాలో మన తెలుగు సినిమా హీరోలు తమ సత్తా చాటుకుంటున్న విషయం మనకు తెలిసిందే…