Allu Arjun Career: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కెరియర్ ని స్టార్ట్ చేసిన అల్లు అర్జున్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా భారీ విజయాలను అందుకున్నాడు…’అలా వైకుంఠపురంలో’ సినిమాతో మొదటిసారి ఇండస్ట్రీహిట్ ని నమోదు చేసిన ఆయన ఆ తర్వాత వచ్చిన ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. ఇక పుష్ప 2 సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక అరుదైన రికార్డును కూడా తన పేరుతో నమోదు చేసుకున్నాడు. ‘బాహుబలి 2’ సినిమా రికార్డును బ్రేక్ చేసిన సినిమాగా పుష్ప 2 సినిమా భారీ గుర్తింపును సంపాదించుకుంది. మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు…అయితే ‘పుష్ప 2’ సినిమాతో వచ్చిన ఇమేజ్ ను కాపాడుకుంటూ ముందుకు సాగుతాడా? లేదంటే మరోసారి డౌన్ ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కొన్ని అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అట్లీతో చేస్తున్న సినిమా మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: కెరియర్ మొదట్లో అల్లు అర్జున్ పట్టుబట్టి మరి ఆ దర్శకుడితో సినిమా చేయడానికి అసలు కారణం ఏంటంటే..?
అట్లీ కాపీ పేస్ట్ దర్శకుడు అంటూ అతనితో సినిమాలు ఎందుకు చేస్తున్నాడు అంటూ కొంతమంది కొన్ని రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే, మరి కొంతమంది మాత్రం అట్లీ కాపీ పేస్ట్ చేసిన కూడా సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలుపుతాడు అంటూ కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం…
మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ ఇకమీదట వేసి స్టెప్ చాలా పకడ్బందీగా వేసేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా కూడా పుష్ప 2 తో వచ్చిన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక దానికి తోడుగా వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లను సాధించినప్పుడు మాత్రమే అతను అనుకున్న నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకోగలుగుతాడు.
Also Read: అల్లు అర్జున్ ఆ ఒక్క సినిమాతో చాలా వరకు వెనకబడ్డాడా..?
మరి ఇలాంటి సందర్భంలో ఎక్స్పరిమెంట్లు చేసే కంటే కూడా సక్సెస్ ఫుల్ దర్శకులతో ముందుకు సాగడమే మంచిదని అతను అట్లీ ని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. అట్లీ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ మంచి విజయాలుగా నిలిచాయి…అందుకే అతను అట్లీ కిఓటు వేశాడు. లేకపోతే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ త్రివిక్రమ్ కి పాన్ ఇండియా మార్కెట్ లేదనే ఉద్దేశ్యంతోనే ఆయన అట్లీ ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది…