Salaar 2: సలార్ 2 లో బాలీవుడ్ స్టార్ హీరో… ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే…

కల్కి, రాజసాబ్ అనే సినిమాలను చేస్తున్నాడు. అయితే ఈ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమా కూడా చేయబోతున్నాడు.

Written By: Gopi, Updated On : May 1, 2024 5:05 pm

Bollywood star hero in Salaar 2

Follow us on

Salaar 2: తెలుగు సినిమా ఇండస్ట్రీ తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ అనే చెప్పాలి. ఇక ఈయన చేసిన మొదటి సినిమా నుంచి మొన్న వచ్చిన సలార్ సినిమా దాకా ప్రతి సినిమాలో కూడా తనదైన వైవిధ్యమైన నటనను కనబరుస్తూ ఇండస్ట్రీలో చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. అలాగే సీనియర్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ తను ఒక్కొక్క స్టెప్ పైకి ఎదిగిన విధానం చూస్తుంటే నిజంగా ప్రభాస్ లాంటి స్టార్ హీరో మన ఇండస్ట్రీలో ఉండడం మన అదృష్టం అనే చెప్పాలి.

ఇక ఇప్పుడు ఈయన కల్కి, రాజసాబ్ అనే సినిమాలను చేస్తున్నాడు. అయితే ఈ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమా కూడా చేయబోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేయబోయే సలార్ 2 సినిమా మీద పలు రకాల వార్తలైతే వస్తున్నాయి. అయితే ఈ సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయనప్పటికీ, ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజ నటుడు స్టార్ హీరో అయిన ‘అమితాబచ్చన్ ‘ ఒక క్యారెక్టర్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే సలార్ 2 సినిమాలో ప్రభాస్ కి గురువుగా నటించే ఒక క్యారెక్టర్ అయితే ఉంటుందట. ఈ క్యారెక్టర్ లో ఎవరిని తీసుకుంటే బావుంటుంది అని ప్రశాంత్ నీల్ చాలా రకాల చర్చలు జరిపినప్పటికీ తనకు ఫైనల్ గా వచ్చిన ఆప్షన్ మాత్రం అమితాబచ్చన్ అనే చెబుతున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన్ని ఈ సినిమాలో భాగం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో కూడా అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ కనిపించబోతున్నాడు… ఇక ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ సినిమాల్లో అమితాబచ్చన్ నటించడం అనేది ఒక వంతుకు మంచి విషయం అనే చెప్పాలి… ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ఇప్పుడు చేయబోయే వరుస సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టాలనే సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తుంది…