https://oktelugu.com/

Akshay Kumar: స్టార్ హీరో అక్షయ్ కుమార్ పై ఫైర్ అవుతున్న నెటిజన్లు… కారణం ఏంటంటే ?

Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. ఇటీవలే సూర్య వంశీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు ఈ హీరో. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురవుతున్నారు అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ” పృథ్వీరాజ్ “. ఇటీవల ఈ చిత్ర టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో అక్షయ్ సరసన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 23, 2021 / 06:12 PM IST
    Follow us on

    Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. ఇటీవలే సూర్య వంశీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు ఈ హీరో. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురవుతున్నారు అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ” పృథ్వీరాజ్ “. ఇటీవల ఈ చిత్ర టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో అక్షయ్ సరసన 2017 మిస్‌ వరల్డ్‌ మానుషి చిల్లర్‌ నటించారు. ఇప్పుడు ఈ విషయమే ఒక కొత్త వివాదానికి తెరలేపింది. అక్షయ్, మానుషి మధ్య వయసు తేడా గురించి సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతూ కామెంట్లు చేస్తున్నారు.

    తనకన్నా తక్కువ వయసు హీరోయిన్ తో రొమాన్స్ ఏంటని అక్షయ్ ను నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.  అక్షయ్ కు 54 సంవత్సరాలు, మానిషికి 24 సంవత్సరాలు ఉన్నాయి. దీంతో ఇదేం లవ్‌ స్టోరీ అంటూ ఓ యూజర్‌ స్పందించగా… 54 ఏళ్ల అక్షయ్‌ కుమార్‌, 24 ఏళ్ల మానుషితో రొమాన్స్‌ చేస్తున్నాడు, గుర‍్తుంచుకోండి మనం కొంచెం జాగ్రత్తగా హీరోలను ఎంచుకోవాలి అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. ఇంకొకరు ‘వాట్‌ ద హెల్ మ్యాన్‌, ఇది కొంచెమైనా భావ్యంగా ఉందా అని సోషల్ మీడియాలో కొంతమందిని నెటిజన్స్‌ ఫైర్ అవుతున్నారు.

    సినిమా రంగంలో ఇది సర్వసాధారణమని సినిమా అనేది ఒక వినోదాత్మకంగా తీసుకోవాలి నెటిజన్స్‌ అని కొందరు ప్రముఖులు తెలిపారు. అలా అనుకుంటే సౌత్ ఇండియాలో కూడా బాలయ్య సరసన శృతిహాసన్ నటిస్తున్నారు, నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. 29 ఏళ్ల దిశా పటానీతో 55 సంవత‍్సరాల సల్మాన్‌ ఖాన్‌ రొమాన్స్‌ చేశాడు. అజయ్‌ దేవగన్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించింది.