Lic Policy: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఎల్‌ఐసీ ఎన్నో పాలసీలను అమలు చేస్తుండగా ఆ పాలసీలలో జీవన్ అక్షయ్ పాలసీ కూడా ఒకటి. ఈ పాలసీలో చేరడానికి 30 సంవత్సరాలు కనిష్ట వయస్సు కాగా 85 సంవత్సరాలు గరిష్ట వయస్సుగా ఉంది. ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్ స్కీమ్‌లో ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఇన్వెస్ట్ చేయవచ్చు.
Also Read: ఫోన్ పట్టుకుంటే షాక్ యే ఇక.. ఎయిర్ టెల్ బాటలోనే వోడాఫోన్, ఐడియా రేట్లు భగ్గు
ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులను వార్షికంగా, అర్ధ సంవత్సరం, త్రైమాసికం లేదా ప్రతి నెలా పెన్షన్ ను పొందవచ్చు. ప్రతి నెలా ఆదాయం పొందాలని అనుకునేవాళ్లకు ఈ పాలసీ బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేసిన మూడు నెలల తర్వాత రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే సంవత్సరానికి 12,000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. రూ.40,72,000 ఇన్వెస్ట్ చేస్తే నెలకు 20,000 రూపాయలు పెన్షన్ పొందవచ్చు.
ఈ పాలసీలో మొత్తం పది ఆప్షన్లు ఉండగా పెట్టుబడిని బట్టి పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ విధంగా జీవితకాలం పెన్షన్ ను పొందే ఛాన్స్ ఉంటుంది. మొదటిసారి చెల్లించే ప్రీమియంను బట్టి యాన్యుటీ మారుతుందని గుర్తుంచుకోవాలి. ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని బట్టి పొందే పెన్షన్ ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. పాలసీ తీసుకున్న సమయంలో వడ్డీరేటును లాక్ చేస్తారు.
ఒకసారి నిర్ణయించిన వడ్డీరేటు జీవిత కాలం వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ పాలసీ వల్ల పాలసీ తీసుకున్న వాళ్లకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ పాలసీ నాన్- లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్, పర్సనల్ యాన్యుటి పాలసీ కావడం గమనార్హం.
Also Read: ఎస్బీఐ సూపర్ స్కీమ్.. రూ.10 వేలకు లక్ష రూపాయల లాభం పొందే ఛాన్స్?