Priyanka Chopra: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేంజ్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగారు ప్రియాంక చోప్రా జోనాస్. ప్రస్తుతం ఆమె నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్’ ప్రమోషన్‌లో బిజీగా ఉంది ఈ అమ్మడు. తాజాగా ఓ వార్తా కథనంపై మండిపడ్డారు ప్రియాంక. ఇంకా ఇలా ఏన్నాళ్లు రాస్తారు మహిళలకు ఇంకా ఇలా ఎందుకు జరుగుతుందో అని అసహనం వ్యక్తం చేసింది ప్రియాంక. అసలు విషయం ఏమిటంటే ఒక వెబ్‌సైట్ తన వార్త కథనంలో ప్రియాంక చోప్రాను నిక్ జోనాస్ భార్యగా రాయడం జరిగింది. ఆ కథనం ప్రియాంక కోపానికి కారణమైంది. అలా రాసిన వార్తను తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేస్తూ ఘాటుగా రిప్లై ఇచ్చింది ఈ భామ.

Also Read: రాజమౌళి మన మధ్య ఉండటం.. భారతీయ సిసీ పరిశ్రమ చేసుకున్న అదృష్టం- కరణ్ జోహార్
మోస్ట్ ఐకానిక్ ఫిల్మ్ ఫ్రాంచైజీకి చెందిన ‘ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్’ చిత్రాన్ని నేను ప్రమోట్ చేస్తుంటే… ఇప్పటికీ నేను ‘ది వైఫ్ ఆఫ్’ గా గుర్తించబడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మహిళలకు ప్రస్తుతం కాలంలో కూడా ఎందుకు జరుగుతుందో దయచేసి వివరణ ఇవ్వమని కోరింది. నేను నా ఐఎండీబీ లింక్‌ని నా బయోకు జోడించాలా ? అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది. దీనికి ప్రియాంక భర్త నిక్ జోనాస్‌ను కూడా ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ప్రియాంక(Priyanka Chopra) తన తదుపరి ప్రాజెక్ట్ సిటాడెల్ షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. అలానే “మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్” విడుదలకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్‌లో ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించనుంది ప్రియాంక. ఇందులో స్టార్ హీరోయిన్లు కత్రీనా కైఫ్, అలియా భట్ కూడా నటిస్తున్నారు.