https://oktelugu.com/

Prabhas: ప్రభాస్ మీద మళ్లీ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న బాలీవుడ్ జనాలు…ఎందుకంటే..?

ప్రభాస్ ని ఎలాగైనా సరే తొక్కెయ్యాలనే ఉద్దేశ్యం తో బాలీవుడ్ చాలావరకు ప్రయత్నం చేస్తుంది. ఇక అందులో భాగంగానే ఆయనతో 'ఆది పురుషు' అనే ఒక డిజాస్టర్ సినిమాని కూడా తీయించారు.

Written By: , Updated On : May 8, 2024 / 02:18 PM IST
Bollywood people are again making negative comments on Prabhas

Bollywood people are again making negative comments on Prabhas

Follow us on

Prabhas: ప్రస్తుతం పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తెలుగులో చేసిన ఈశ్వర్ సినిమా నుంచి మొన్న చేసిన సలార్ సినిమా వరకు అన్ని సినిమాల్లో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని ఎంచుకొని సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇక ఈయన కెరియర్లో చాలావరకు సక్సెస్ లు వచ్చాయి అలాగే ఫెయిల్యూర్స్ కూడా వచ్చాయి. అయినప్పటికీ ఆయన వేటిని పట్టించుకోకుండా తను సినిమాలు మాత్రమే చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరో తెలుగు హీరో అయినందుకు నిజంగా మనం గర్వపడాలి. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ని ఎలాగైనా సరే తొక్కెయ్యాలనే ఉద్దేశ్యం తో బాలీవుడ్ చాలావరకు ప్రయత్నం చేస్తుంది. ఇక అందులో భాగంగానే ఆయనతో ‘ఆది పురుషు’ అనే ఒక డిజాస్టర్ సినిమాని కూడా తీయించారు.

అంటే బాలీవుడ్ వాళ్ళు ఎంత లా ప్రభాస్ మీద కక్ష్య కట్టారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఆయన సినిమా ఏదైనా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఆ సినిమా మీద చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ ను చేస్తూ వస్తున్నారు. సలార్ సినిమా రిలీజ్ కి ముందు కూడా ఇలాగే నెగిటివ్ కామెంట్స్ అయితే చేశారు. ఇక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తూ వాటిని వైరల్ కూడా చేశారు. ఇక ఇప్పుడు అదే నేపథ్యంలో కల్కి సినిమా కూడా తొందర్లోనే రిలీజ్ రెడీ అవుతుంది.

ఇక ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే ఆయన మీద విషం కక్కుతూ బాలీవుడ్ జనాలు చాలా వరకు మళ్ళీ ప్రభాస్ ని డి గ్రేడ్ చేస్తూ అయిన క్రేజ్ ను తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ప్రభాస్ ను సినిమాలపరంగా ఎదుర్కోలేని బాలీవుడ్ మాఫియా గాని, బాలీవుడ్ మీడియా గాని అతని క్రేజ్ ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ తన క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గకుండ ఇంకా పెరిగి పోతుందనే చెప్పాలి…